Record Level Liquor Sales In Andhra Pradesh: కొత్తగా మద్యం విధానం అమల్లోకి రావడంతో ఆంధ్రప్రదేశ్లో మందుబాబులు పండుగ చేసుకుంటున్నారు. కొత్త విధానం అమల్లోకి వచ్చిన రోజే వైన్స్, బార్లకు బారులు తీరారు. ఫలితంగా మూడు నెలల్లోనే రికార్డు స్థాయిలోనే భారీగా విక్రయాలు జరిగాయి. మందుబాబులకు మందు.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
కొత్త విధానం: ఎన్నికల్లో తీవ్రంగా ప్రభావితం చేసిన మద్యం విధానం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిపోయింది.
అన్ని రకాలు: బ్రాండెడ్ మద్యం.. అన్ని రకాల బ్రాండ్ మద్యం అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. కొత్త మద్యం విధానం అమల్లోకి రావడంతో భారీగా అమ్మకాలు జరిగాయి.
భారీగా విక్రయాలు: ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో అక్టోబర్ 16వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో 3,300 దుకాణాల్లో విక్రయాలు ప్రారంభమయ్యాయి.
మద్యం అమ్మకాలు: అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు రూ.4,677 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి.
బీర్లు భారీగా: కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చాక 61.63 లక్షల కేసుల మద్యం తాగేశారు. 19.33 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగాయి.
భారీగా ఆదాయం: మద్యం విక్రయాలు భారీగా జరగడంతో మందుబాబులు పండుగ చేసుకోగా.. ప్రభుత్వానికి భారీగా మద్యం నుంచి ఆదాయం లభించింది.
ముందుంది పండుగ: కొత్త సంవత్సరం.. సంక్రాంతి పండుగకు ఊహించని రీతిలో మద్యం విక్రయాలు ఉంటాయని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది.