Weather Update: బాబోయ్‌.. ఇదేం చలి? భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు, తీవ్ర ఇబ్బందులు..

Telangana Weather Update: తెలంగాణాలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో చలి తీవ్రత పెరిగిపోయింది. ఇప్పటికే వాహనదారులకు కూడా పొంగ మంచు కమ్ముకుంటుందని వాతావరణ శాఖ అలెర్ట్‌ చేసిన సంగతి తెలిసింది. వృద్ధులు, చంటి పిల్లలపై కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది ఐఎండీ. 
 

1 /8

రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిపోయింది. ఈ సారి వర్షాలు కూడా పడటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల వర్షాలు పడుతున్నాయి. తుఫాను ప్రభావం లేకున్నా చలిగాలులు, చెదురు ముదురు వర్షాలు ఇబ్బందులు పెడుతున్నాయి.  

2 /8

తమిళనాడు గుండా ఈ అల్పపీడనం పయణిస్తోంది. ఈనేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాల్లో ఈనెల 18వ తేదీ కూడా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావం తమిళనాడులో కూడా ఉంటుంది.  

3 /8

ఈ నేపథ్యంలో చలిగాలులు కూడా వీచే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా చలిగాలులు వీస్తాయి. ఇప్పటికే రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియెస్‌కు పడిపోయాయి. పగలు వాతావరణం 26 డిగ్రీలు ఉంటుంది.  

4 /8

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఈ చలి తీవ్రంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు ఈ ప్రాంతంలో పడిపోతున్నాయి. దీంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు 7 డిగ్రీలకు పడిపోతున్నాయి. సాయంత్ర అయిందంటే చాలు చలి గాలులు వీస్తున్నాయి.  

5 /8

చలికి పొగమంచు కూడా తోడవ్వడంతో వాహనదారులు అలెర్ట్‌గా ఉండాలని భారత వాతావరణ శాఖ వాహనదారులకు హెచ్చరికలు చేసింది. వాహనాలు ఉదయం నడిపేటప్పుడు లైట్లు వేసుకుని ప్రయాణం చేయాలని సూచించింది. లేకుంటే ప్రమాదం ఏర్పడుతుంని ఈ హెచ్చరిక చేసింది.  

6 /8

ఈ చలి తీవ్రత ఉదయం 9 గంటల వరకు ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం కూడా త్వరగా చీకటి పడుతోంది. చలికాలం ఇలాగే జరుగుతుంది కాబట్టి పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి తగిన ఆహారం కూడా తీసుకోవాలని గతంలో వాతావరణ శాఖ కొన్ని సూచనలు చేసింది.  

7 /8

అయితే, ఏపీలోను అల్పపీడనం చలి వల్ల ఇబ్బందులు పడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఈరోజు స్కూళ్లు, అంగన్‌వాడీలకు సెలవులు కూడా మంజూరు చేశారు. ముఖ్యంగా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. నిన్న తిరుమలలో కూడా భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. వేంకటేశుని ఆలయ పరిసరాలు తడిసి ముద్దయ్యాయి.  

8 /8

ఇక ఏపీకి ఫెంగల్‌ తుఫాను ప్రభావం తగ్గింది. కానీ రెండు జిల్లాల్లో భారీ వర్షాలు ఈ రెండు రోజులు కూడా నమోదు అవుతాయని వాతావరణ శాఖ చెప్పింది. ముఖ్యంగా కోస్తా, రాయలసీమ.. మిగతా ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రభావం తమిళనాడుపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది.