Tirumala Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దీని ప్రభావంతో ఈ రోజు తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.భారీ వర్షాలు కురుస్తాయన్న సమాచారంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అందుకు తగ్గ విధంగా అధికారులకు పలు సూచనలు చేసింది.అల్పపీడన ప్రభావంతో తిరుపతి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా తిరుపతి జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలకు, అంగన్వాడీ కేంద్రాలకు ఇవాళ సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా ఇంఛార్జి కలెక్టర్ శుభం బన్సల్ ఆదేశాలు జారీ చేశారు.
*
తిరుపతి, సూళ్లూరుపేట వర్ష ప్రభావ ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించింది. ఘాట్ రోడ్లు, కొండచరియలున్న ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా తిరుమల కొండపై ఉన్న పాపనాశనం, గోగర్భం డ్యామ్స్ పొంగి పొర్లుతున్నాయి. గాలుల దెబ్బకు చలి తీవ్రత కనిపించింది. తిరుమలలోని జలాశయాల్లో భారీగా నీరు చేరింది. దీంతో నీటిని కిందికి విడిచిపెట్టారు. మరోవైపు భారీ వర్షాలతో భక్తులు తీవ్ర ఇక్కట్లు ఎదర్కొంటున్నారు. భారీ వర్షాల మూలంగా తిరుమల ఘాట్ రోడ్స్ పై కొండ చరియలు విరిగిపడుతున్నాయి. మరోవైపు వాహనదారులు నెమ్మదిగా వెళ్లమని తిరుమల తిరుపతి అధికారులు కోరుతున్నారు. కొండపై భారీ వర్షం నేపథ్యంలో రూమ్స్ దొరకని భక్తులు చలికి వణికిపోతున్నారు. మరోవైపు క్యూ లైన్స్ లో ఉన్న భక్తులు చలి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని వైపులా వర్షం నిలిచి ఉండటంతో చిన్న పిల్లలతో వచ్చిన భక్తులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మరోవైపు టీటీడీ వర్షాల నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
ఇక తిరుమల కాకుండా ఇతర జిల్లాల్లో అధికారులు.. ఎప్పటికప్పుడు రైతులు, గొర్రెల కాపరులు, మత్స్యకారులను ఫోన్ కాల్స్, సందేశాల ద్వారా హెచ్చరికలు పంపి అప్రమత్తం చేస్తోంది. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఈ వానలతో స్వర్ణముఖి, కాళంగి నదులతో పాటు పలు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మరోవైపు ఏపీలోని మన్యంలో చలి తీవ్రత కొనసాగుతోంది. ఉదయం వేళల్లో పొగమంచు దట్టంగానే కురుస్తోంది.. ఏజెన్సీలో ఉదయం తొమ్మిది గంటల వరకు పొగమంచు కమ్ముకుని ఉంటోంది. చలి దెబ్బకు జనాలు వణికిపోతున్నారు.
ఇదీ చదవండి: ఫామ్ హౌస్ రౌడీ.. ఆది నుంచి మోహన్ బాబు తీరు వివాదాస్పదం..
ఇదీ చదవండి: Nagababu Cabinet: ముగ్గురు మొనగాళ్లు.. దేశంలోనే మొదటిసారి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.