Allu Arjun- Revanth Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌తో ప్రస్తుతం సోషల్ మీడియాలో.. పెద్ద వార్ మొదలైపోయింది. కాగా అల్లు అర్జున్ ని సంధ్య థియేటర్.. ఘటన కారణంగా.. చిక్కడిపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఇక ఇప్పటికే అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు, అభిమానులు చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకుంటున్నారు. ఇదంత పక్కన పెడితే…అల్లు అర్జున్ అరెస్ట్ అయి ఇన్ని గంటలు కావస్తున్నా కానీ.. బెయిల్ పై ఇంకా స్పష్టత రాలేదు. మరోపక్క అల్లు అర్జున్.. టీం బెయిల్ కోసం అన్ని విధాలుగా ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలో.. రేపు రెండో శనివారం, తర్వాత ఆదివారం కావడంతో అల్లు అర్జున్ అభిమానుల్లో టెన్షన్ మొదలైంది.
ఇక ఈ నేపథ్యంలో.. ఈ అరెస్ట్ కి సంబంధించి ఒక కథ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ మధ్య జరిగిన పుష్పా సినిమా సక్సెస్ మీట్ తో..తెలంగాణ ప్రభుత్వానికి అల్లు అర్జున్ థ్యాంక్స్ చెప్పారు.అయితే ఈ సందర్భంగా.. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం.. అంటూ ఆపేశారు. ఆయనకు అక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు గుర్తుకు రాలేదు. దీంతో కాసేపు నీళ్లు తాగడానికి సమయం తీసుకుని.. తర్వాత రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పారు. ఇక ఆ సక్సెస్ మీట్ దగ్గర నుంచి..నెటిజన్లు దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ముఖ్యమంత్రి పేరును అల్లు అర్జున్ మరిచిపోయారని కామెంట్స్ పెద్ద సాగారు.
ఈ క్రమంలో.. ఇప్పుడు ఇంత అత్యవసరంగా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయదానికి.. ఆ మాటలు కూడా మనసులో పెట్టుకోవడం కారణం అవ్వచ్చు అని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అల్లు అర్జున్ అరెస్టు అయిన ఓ వార్తకు సంబంధించి.. బీఆర్ఎస్ నేత, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు.. మరోసారి పేరు మర్చిపోడని ఇచ్చిన రిప్లయ్ ఇవ్వడం ప్రస్తుతం వైరల్ గా మారుతోంది.
Reason for Allu Arjun Arrest 🙏#AlluArjun pic.twitter.com/vTj4vgWbYZ
— 𝐊𝐞𝐭𝐡𝐢 𝐑𝐞𝐝𝐝𝐲 𝐀𝐝𝐝𝐚 (@KethiReddy_Adda) December 13, 2024
అయితే ఈ అంశంపై పోలీసులకు.. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సంకేతాలు .. ఆదేశాలు వెళ్లలేదని తెలుస్తోంది. సెలబ్రిటీలు తప్పులు చేసినా.. పోలీసులు ఏమి చేయకుండా చూస్తూ ఉండరన్న ఓ గట్టి సందేశాలన్ని పంపాలన్న ఉద్దేశం, కేసు తీవ్రత కారణంగానే.. అల్లు అర్జున్ ని అరెస్టు చేసినట్లుగా చెబుతున్నారు.
ఇదీ చదవండి: Nagababu Cabinet: ముగ్గురు మొనగాళ్లు.. దేశంలోనే మొదటిసారి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.