Sobhita - Naga Chaitanya: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని నాగార్జున వారసుడిగా నాగచైతన్య ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం టైర్ -2 హీరోగా సెటిల్ అయ్యారు నాగచైతన్య. ఇకపోతే ఏ మాయ చేసావే సినిమాలో హీరోయిన్ గా చేసిన సమంతతో ప్రేమలో పడ్డ ఈయన ఏడేళ్ల పాటు ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి 2017లో వివాహం చేసుకున్నారు.
అయితే దాంపత్య జీవితంలో సంతోషంగా ఉంటారు అనుకున్న ఈ జంట, అనూహ్యంగా 2021 అక్టోబర్ 2న విడాకులు ప్రకటించి, అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక మరుసటి, ఏడాదే నాగచైతన్య శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. వీరి ఎఫైర్ వార్తలపై రూమర్స్ ఎన్నో వినిపించినా వీరు మాత్రం స్పందించలేదు..
ఈ ఏడాది ఆగస్టు 8న నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచారు. మీకు డిసెంబర్ 4న పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. ఇకపోతే శోభిత పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.
అందులో ఆమె డాన్స్ చేస్తున్న వీడియో ఒకటి బయటికి రావడంతో ఆమె చేతికి పెట్టుకున్న గోరింటాకు ఎలా పండింది అనే విషయంపై కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా ఏ అమ్మాయి అయినా సరే పెళ్లికి ముందు గోరింటాకు పెట్టుకుంటే బాగా పండితే మంచి అబ్బాయి వస్తాడని సంసారం కలకాలం ఉంటుందని అంటారు. కానీ శోభిత చేతికి మాత్రం గోరింటాకు అంతంత మాత్రంగానే పండింది. దీన్ని బట్టి చూస్తే ఈమె వైవాహిక బంధంలో చిక్కులు తప్పవు అనే కొత్తకోణంలో నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.
వాస్తవానికి వేణు స్వామి వీరిద్దరి వివాహం ప్రకటించినప్పుడు వీరిద్దరి వివాహం చేసుకుంటే జాతకం ప్రకారం విడిపోతారని కామెంట్లు చేశారు. గతంలో నాగచైతన్య సమంత విడిపోతారని చెప్పిన వేణు స్వామి ఆయన చెప్పినట్టుగానే.. వారు విడిపోయారు.
మళ్ళీ ఇప్పుడు వేణు స్వామి చెప్పిన కామెంట్లు వైరల్ అవుతున్న నేపథ్యంలో సడన్‌గా.. శోభిత గోరింటాకు గురించి వార్తలు మరింత వైరల్ గా మారుతున్నాయి. మరి వీరి భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి అంటూ నేటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Allu Arjun Arrest: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్.. మృతురాలు రేవతి భర్త కేసు వెనక్కి?
Also Read: Allu Arjun: పోలీసుల అత్యుత్సాహం.. బెడ్రూమ్లోకి రావడంపై అల్లు అర్జున్ ఆగ్రహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter