Sudigali Sudheer: రష్మీకి షాకిచ్చిన సుడిగాలి సుధీర్.. ఆ స్టార్ ప్రొడ్యూసర్ కూతురితో పెళ్లికి గ్రీన్ సిగ్నల్

Sudigali Sudheer Marriage: జబర్దస్త్ షో ద్వారా కమెడియన్‌గా పరిచయమై.. తనదైన శైలిలో భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్. వెండితెరపైనా కమెడియన్‌గా నటిస్తూ.. హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం హోస్ట్‌గా వ్యవహరిస్తూ.. సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు. తాజాగా సుధీర్ పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. ఓ బడా ప్రొడ్యూసర్ కూతురితో పెళ్లికి సిద్ధమయ్యాడని ప్రచారం జరుగుతోంది.
 

1 /7

ఆన్‌స్క్రీన్‌పై యాంకర్ రష్మీతో సుధీర్ ప్రేమయాణం అందరికి తెలిసిందే. వీరిద్దరు కలిసి స్క్రీన్‌పై కనిపిస్తే.. అభిమానులకు పండగే.  

2 /7

బుల్లితెరపై ఈ జోడికి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని చాలామంది అభిమానులు కోరుతున్నారు.  

3 /7

జబర్దస్త్ షోకు సుధీర్ దూరమైనా.. రష్మీ మాత్రం యాంకర్‌గా కంటిన్యూ చేస్తోంది. రష్మీ ఫొటోలు, వీడియోలు ఎక్కడ కనిపించినా.. కామెంట్ బాక్స్‌లో మాత్రం సుధీర్ కచ్చితంగా ఉంటుంది.  

4 /7

ఇక త్వరలో సుడిగాలి సుధీర్ పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తుండగా.. వధువు ఎవరు..? అంటూ నెటిజన్లు సర్చ్ చేస్తున్నారు.   

5 /7

టాలీవుడ్‌కు చెందిన ఓ బడా నిర్మాత కూతురితో సుధీర్ పెళ్లికి ఒకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.  

6 /7

ఆయనే స్వయంగా వచ్చి సుధీర్‌ ముందు పెళ్లి ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తోంది. సుధీర్ కూడా ఒకే చెప్పాడని.. త్వరలోనే ఆ నిర్మాత కుమార్తెను పెళ్లి చేసుకుంటాడని చర్చించుకుంటున్నారు.  

7 /7

అయితే ఆ స్టార్ ప్రొడ్యూసర్ ఎవరు అనేది సస్పెన్స్‌గా మారింది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.