Samantha Ruth prabhu: సమంత రూత్ ప్రభు ప్రస్తుతం నెట్టింట పెట్టిన పోస్ట్ పట్ల నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారంట. అదే విధంగా సామ్.. ఈ మధ్య భలే ట్విస్టులు ఇస్తుందంటూ కూడా అంటున్నారంట.
సమంత ఇటీవల తరచుగా వార్తలలో ఉంటున్నారు. ఎక్కువగా ఆమె పెట్టిన పోస్టులు ఇన్ డైరెక్ట్ గా కాంట్రవర్సీ అయ్యే విధంగా ఉంటున్నాయని కూడా టాక్ నడుస్తొంది. ఈ క్రమంలో తాజాగా, సామ్ నెట్టింట పెట్టిన పోస్టు మాత్రం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకొవచ్చు.
సామ్.. ఇటీవల వరుణ్ ధావన్ తో చేసిన వెబ్ సిరిస్.. సిటాడెల్ హనీ బన్నీ ప్రస్తుతం ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు తెలుస్తొంది. అయితే.. ఈ క్రమంలో మరల సమంత రక్ట్ బ్రహ్మాండ్ వెబ్ సిరిస్ ప్రస్తుతం చేస్తున్నారంట. దీనికి దుంబాడ్ ఫేమ్ రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే.. తాజాగా, సామ్.. ఇన్ స్టాలో పెట్టిన పోస్టులు ఆయన ఎక్స్ మీద పెట్టిన ఖర్చులంటూ.. తన కుక్క ప్రేమ కంటే ఎవరి మీద ఎక్కువ కాదని పోస్టులు పెట్టారు. అంతేకాకుండా.. కొత్త ఏడాది తనను ప్రేమగా చూసుకునే భర్త, పిల్లలతో మంచి జీవితం స్టార్ట్ చేస్తానని కూడా ఆమె పోస్ట్ పెట్టారు. ఈ క్రమంలో తాజాగా .. రాణా దగ్గుబాటి బర్త్ డే నేపథ్యంలో ఆమె ప్రత్యేకంగా విష్ చేస్తు పోస్ట్ పెట్టారు.
రాణా దగ్గుబాటిని సామ్.. ఒక అన్నలా భావిస్తుంటారు. ఇటీవల జిగ్రా మూవీ రిలీజ్ ఈవెంట్ హైదరబాద్ లో జరిగినప్పుడు.. రాణా లాంటి అన్న అందరికి ఉండాలని .. ఆయనను ప్రశంసించారు.
అదే విధంగా రాణా సైతం.. ఇటీవల ఐఫా అవార్డుల ప్రధానోత్సవం నేపథ్యంలో.. సమంత ఇజ్ మై సిస్టర్ అంటూ తెగ ప్రశంసించారు. అయితే.. రాణా బర్త్ డే నేపథ్యంలో.. రాణా యువర్ మై హీరో.. నేను నీకు అభిమానిని.. ప్రతిపనిలోను వందశాతం కష్టపడతావు.. నిన్ను చూసి ఎంతో నేర్చుకున్నానంటూ ప్రశంసించారు.
ఆ దేవుడి ఆశీస్సులు నీకు ఎల్లవేళలా ఉండాలని కూడా కోరుకుంటున్నట్లు సామ్..చెబుతూ.. హ్యాపీ బర్త్ డే రాణా అంటూ పోస్ట్ పెట్టారు. అయితే.. కొంత మంది నెటిజన్లు మాత్రం.. ఇది తన మాజీ భర్త చైతు కోసం పెట్టిందని ట్రోల్స్ చేస్తున్నారంట. దీంతో ఈ విషయం తెలియని కొందరు ఈ ట్విస్ట్ మాకేంటీ తల్లి అని తలలు పట్టుకుంటున్నారంట.