WHO: ఆ భ్రమలు తొలగించుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే..

ప్రపంచ మానవాళిని కలవరపెడుతోన్న కరోనా మహమ్మారి స్వరూపం అర్ధం కాక తలమునకలవుతున్నారు. కాగా కోవిడ్ -19 నుండి కోలుకున్న యాంటీబాడీ కలిగి ఉన్న వ్యక్తులు, వాటిని సంక్రమింపజేసి

Last Updated : Apr 25, 2020, 06:31 PM IST
WHO: ఆ భ్రమలు తొలగించుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే..

న్యూఢిల్లీ: ప్రపంచ మానవాళిని కలవరపెడుతోన్న కరోనా మహమ్మారి స్వరూపం అర్ధం కాక తలమునకలవుతున్నారు. కాగా కోవిడ్ -19 నుండి కోలుకున్న యాంటీబాడీ కలిగి ఉన్న వ్యక్తులు, వాటిని సంక్రమింపజేసి రక్షించబడ్డారని అనడానికి ప్రస్తుతం ఎటువంటి ఆధారాలు లేవని ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనావైరస్ వ్యాధికి యాంటీ బాడీ ఉన్న వ్యక్తులకు రోగనిరోధక శక్తి పాస్పోర్ట్, రిస్క్-ఫ్రీ సర్టిఫికేట్ జారీ చేయవచ్చని కొన్ని ప్రభుత్వాలు సూచించిన తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకత్వం ఇచ్చింది. వారు సురక్షితంగా ఉన్నారనడానికి గాని ఎటువంటి ఆధారాలు లేవని అన్నారు.

Also Read: ప్రజల వద్దకే 'కరోనా' ఆస్పత్రి..!!

ఒకవేళ ఇటువంటి భ్రమలను ప్రభుత్వాలు తొలగించుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ మార్గదర్శకత్వాన్ని విస్మరిస్తే వ్యాధి మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని సూచించింది. ప్రస్తుతం చాలా దేశాలు యాంటీబాడీస్ కోసం పరీక్షిస్తున్నప్పటికీ, ఈ అధ్యయనాలు వ్యాధి నుండి కోలుకున్న వ్యక్తులు రోగనిరోధక శక్తిని పొందుతారో లేదోనని, వాటికి స్పష్టమైన ఆధారాలు లేవని అన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News