హైదరాబాద్ లో తెల్లవారుజామునే భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాంపల్లిలోని కృష్ణ పిల్లల ఆస్పత్రిలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 3 గంటలకు ప్రమాదం జరిగింది.
అగ్ని ప్రమాదం సంభవించగానే ఆస్పత్రి సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఆస్పత్రిలో పలు వ్యాధులకు చికిత్స తీసుకుంటున్న పిల్లలు, వారి తల్లిదండ్రులను హుటాహుటిన బయటకు తరలించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. కానీ మంటల కారణంగా అల్లుకున్న పొగకు పిల్లలు, వారి తల్లిదండ్రులకు ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత తేరుకుని పిల్లలందరినీ లోటస్ ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే చాలా కొద్దిసమయంలోనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఐతే ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే ప్రమాదంలో ఎవరీ ఎలాంటి గాయాలు గానీ ప్రాణ నష్టం గానీ జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..