కూలన్న కన్నెర్ర..!!

'కరోనా వైరస్' కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల వలస కార్మికులకు కష్టాలు తప్పడం లేదు.  ఊరు కాని ఊరులో అష్టకష్టాలు పడుతున్నారు. దీంతో తమ స్వస్థలాలకు వెళ్లాలని కాలినడకనే పయనం కట్టారు.

Last Updated : May 17, 2020, 02:47 PM IST
కూలన్న కన్నెర్ర..!!

'కరోనా వైరస్' కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల వలస కార్మికులకు కష్టాలు తప్పడం లేదు.  ఊరు కాని ఊరులో అష్టకష్టాలు పడుతున్నారు. దీంతో తమ స్వస్థలాలకు వెళ్లాలని కాలినడకనే పయనం కట్టారు.

వలస  కూలీల కోసం కేంద్రం ప్రత్యేకంగా  శ్రామిక్ రైళ్లు నడిపిస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపం వల్ల వలస కూలీలు అందులో ప్రయాణించలేకపోతున్నారు. మళ్లీ కాలినడకనే గమ్యం చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.  కానీ ఎన్ని రోజులు అలా నడుస్తారు..? పిల్లలు, లగేజీ  బ్యాగులతో ప్రయాణం చేయలేకపోతున్నారు. ఈ క్రమంలో వలస కూలీల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

ఉత్తరప్రదేశ్  లో ఇవాళ వలస కార్మికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మథుర-ఆగ్రా జాతీయ రహదారిని నిర్బంధించారు. రాయ్ పురా జత్ ప్రాంతంలో రోడ్డుకు అడ్డంగా బైఠాయించారు. తమను ఉత్తరప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ఉన్న స్వస్థలాలకు తరలించేందుకు వాహనాలు ఏర్పాటు  చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై వాహానాల  రాకపోకలను అడ్డుకున్నారు. తమకు న్యాయం చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని భీష్మించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఉత్తరప్రదేశ్ సర్కారు ఇప్పటి వరకు వలస కూలీలను తరలించేందు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు వలస కార్మికుల ఆగ్రహం నేపథ్యంలో యోగీ ఆదిత్యనాథ్ సర్కారు ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాలి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News