సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ( Sushant Singh Rajput )... బాలీవుడ్లో ఇప్పుడు ఈ పేరు గల నటుడు మనమధ్య లేకున్నా... అతడి పేరు మాత్రం ఇంకా వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తూనే ఉంది. దిల్ బెచారా మూవీతో ఆడియెన్స్‌కి ఓ గొప్ప సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తూనే.. తాను మాత్రం అర్ధాంతరంగా తనువు చాలించిన తీరు పరిశ్రమలో పెను సంచలనం సృష్టించింది. పరిశ్రమకు ఎంతో మంది నటులు వచ్చి వెళ్లినప్పటికీ... వాళ్ల సినీ ప్రస్థానం వేరు.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రస్థానం వేరు.