Mahesh Babu, Trivikram combo: మహేష్ బాబు ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పాడు ( Good news to Mahesh Babu's fans ). మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో కలిసి మహేష్ బాబు ఓ సినిమా చేయనున్నట్టు ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి కానీ ఏ కారణం వల్లనో ఆ ఇద్దరి కాంబోలో సినిమా సెట్ కావడం లేదు.

Last Updated : Oct 7, 2020, 03:54 PM IST
Mahesh Babu, Trivikram combo: మహేష్ బాబు ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పాడు ( Good news to Mahesh Babu's fans ). మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో కలిసి మహేష్ బాబు ఓ సినిమా చేయనున్నట్టు ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి కానీ ఏ కారణం వల్లనో ఆ ఇద్దరి కాంబోలో సినిమా సెట్ కావడం లేదు. ఐతే తాజాగా మహేష్ బాబు చేసిన ఓ ట్వీట్ ఆయన అభిమానుల్లో మళ్లీ మహేష్-త్రివిక్రమ్ కాంబోలో సినిమాపై ఆశలు రేకెత్తించేలా చేసింది. Also read : Rhea Chakraborty gets bail: రియా చక్రవర్తికి బెయిల్ మంజూరు.. కానీ..

మహేష్ బాబు, అనుష్క ( Actress Anushka ) జంటగా నటించిన ఖలేజ సినిమా ( Khaleja movie ) నేటితో 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్ బాబు ఓ ట్వీట్ చేశారు. తన స్నేహితుడు, బ్రిలియంట్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ ( Trivikram ) తెరకెక్కించిన ఈ సినిమా తనలోని నటుడిని మరోసారి వెలికి తీసిందని ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు. తనకు ఈ చిత్రం ఎప్పుడూ ప్రత్యేకమైనదేనని ఆ ట్వీట్‌లో రాసుకొచ్చిన మహేష్ బాబు.. తనకు అలాంటి చిత్రం అందించిన త్రివిక్రమ్‌కి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. త్వరలోనే త్రివిక్రమ్‌తో కలిసి మరో సినిమా తీసే ఆలోచనలో ఉన్నట్టు మహేష్ బాబు ఈ ట్వీట్ ద్వారా వెల్లడించాడు. 

ఖలేజా మూవీ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మూవీ మేకింగ్ షాట్స్‌తో ( Khaleja movie making video ) కూడిన పలు దృశ్యాలను ఒక్క చోట చేర్చిన వీడియో క్లిప్పింగ్‌ను సైతం ఇదే ట్వీట్‌తో కలిపి విడుదల చేశారు. ఆనాటి జ్ఞాపకాలు, యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ సన్నివేశాలు మహేష్ బాబు అభిమానులను కనువిందు చేస్తున్నాయి. Also read : Vakeel Saab షూటింగ్‌లో.. నివేదా థామస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News