TS Model schools entrance test: మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పెంపు

TS Model school entrance exam application last date: హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో తెలంగాణలోని మోడల్ స్కూల్స్‌లో అడ్మిషన్స్ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును మరోసారి పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 22, 2021, 03:50 AM IST
TS Model schools entrance test: మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పెంపు

TS Model school entrance exam application last date: హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో తెలంగాణలోని మోడల్ స్కూల్స్‌లో అడ్మిషన్స్ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును మరోసారి పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.  జూన్ 20వ తేదీ వరకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 6వ తరగతిలో ప్రవేశాలతో పాటు 7వ తరగతి నుంచి 10 వరకు ఖాళీగా ఉన్న సీట్లకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ తెలిపారు. 

Also read : Krishnapatnam ayurvedic medicine: హైదరాబాద్‌కు కృష్ణపట్నం కరోనా ఆయుర్వేద మందు శాంపిల్స్

తెలంగాణలోని మోడల్ స్కూల్స్‌లో అడ్మిషన్స్ (Admissions in TS Model schools) కోరుకునే విదార్థులు ఆన్‌లైన్‌లో http://telanganams.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు సబ్మిట్ చేయవచ్చు. దరఖాస్తు గడువు పొడిగించిన నేపథ్యంలో జూన్ 5, 6 తేదీల్లో నిర్వహించాల్సి ఉన్న ప్రవేశ పరీక్షను కూడా వాయిదా వేస్తున్నట్టు చెప్పిన మోడల్ స్కూల్స్ ప్రాజెక్టు డైరెక్టర్‌.. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని మీడియాకు తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా కట్టడికి లాక్‌డౌన్ (Lockdown in Telangana) అమలులో ఉన్న నేపథ్యంలో పరిస్థితులు చక్కబడి కరోనా కేసులు తగ్గిన తర్వాతే పరీక్షల నిర్వహణ ఉండే అవకాశం ఉందని సమాచారం.

Also read : Telangana: తెలంగాణ కరోనా బులెటిన్.. కొత్తగా మైక్రో కంటెన్మైంట్ జోన్స్ ఏర్పాటు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News