బిఎస్ఇఏపి టెన్త్ క్లాస్ రిజల్ట్స్ 2021: పదో తరగతి ఫలితాల వెల్లడికి రంగం సిద్ధం

ap ssc result manabadi Live Update: అమరావతి: ఏపీలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. విజయవాడలోని ఆర్ అండ్ బీ భవనంలో రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 6, 2021, 01:52 PM IST
బిఎస్ఇఏపి టెన్త్ క్లాస్ రిజల్ట్స్ 2021: పదో తరగతి ఫలితాల వెల్లడికి రంగం సిద్ధం

ap ssc result manabadi Live Update: అమరావతి: ఏపీలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. విజయవాడలోని ఆర్ అండ్ బీ భవనంలో రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు. కరోనావైరస్ నేపథ్యంలో పరీక్షలు రాయకుండానే విద్యార్థులను పాస్ చేస్తూ ఫలితాలు వెల్లడించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పదో తరగతి విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఏ. సుబ్బారెడ్డి తెలిపారు. టెన్త్ క్లాస్ ఫలితాలను బిఎస్ఇ అధికారిక వెబ్‌సైట్ www.bse.ap.gov.in లేదా మనబడి వెబ్‌సైట్ manabadi website తో పాటు ఇతర ఎడ్యుకేషన్ వెబ్‌సైట్స్ ద్వారా తెలుసుకోవచ్చు. 

టెన్త్ క్లాస్ విద్యార్థుల మెమొరాండమ్‌ ఆఫ్‌ సబ్జెక్ట్ వైజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వివరాలు తమ పాఠశాల లాగిన్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు డైరెక్టర్‌ సుబ్బారెడ్డి సూచించారు.

Trending News