ఆదర్శ రైతు బజార్లు వచ్చేస్తున్నాయి

  

Last Updated : Oct 19, 2017, 12:05 PM IST
ఆదర్శ రైతు బజార్లు వచ్చేస్తున్నాయి

ఆంధ్రప్రదేశ్ జిల్లా్ల్లో మరో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనుంది ప్రభుత్వం. త్వరలోనే రాష్ట్రంలో ఆదర్శ రైతు బజార్లను ఏర్పాటు చేయనున్నట్లు మార్కెటింగ్ శాఖమంత్రి ఆదినారాయణరెడ్డి ప్రకటించారు. బుధవారం సచివాలయంలో మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి మాట్లాడుతూ రైతుల అవసరాలను అనుగుణంగా గిడ్డంగులను నిర్మించి, వాటి సంఖ్యను పెంచాలని చెప్పారు. అలాగే రాబోయ్ కాలంలో పత్తి కొనుగోళ్ళలో రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అలాగే మత్య్య పరిశ్రమలు మరిన్ని స్థాపించడం కోసం సీఎంఎఫ్ నిధులను ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు. ఉల్లి, టమోటా రైతులకు కనీస గిట్టుబాటు ధర దక్కేలా మార్కెటింగ్ శాఖ ప్రణాళికలు రచించాలని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా గుంటూరు మిర్చి యార్డులో ఈ - నామ్ సరిగ్గా అమలవుతుందో లేదో అడిగి తెలుసుకున్నారు. 

 

Trending News