Suresh Raina father dies: భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా తండ్రి త్రిలోక్‌చంద్ ( Trilokchand)కన్నుమూశారు. క్యాన్సర్‌తో (Cancer) పోరాడుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. త్రిలోక్‌చంద్ మిలటరీ అధికారి. ఈయనకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో బాంబులు తయారు చేయడంలో మంచి ప్రావీణ్యం ఉంది.
రైనా తండ్రి పూర్వీకుల గ్రామం జమ్ముకశ్మీర్‌లోని 'రైనావరి'. 1990లలో కశ్మీరీ పండిట్ల హత్యల ఘటన అనంతరం ఆయన ఆ గ్రామాన్ని విడిచిపెట్టి...ఉత్తర్‌ప్రదేశ్‌లోని మురాద్‌నగర్‌లో స్థిరపడ్డారు. ఆ సమయంలో తనకు వచ్చే రూ.10వేల జీతంతో.. సురేశ్ రైనా (Suresh Raina) క్రికెట్ కోచింగ్ ఫీజులను కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడేవాడు. ఆ తర్వాత రైనాను 1998లో లక్నోలోని గురుగోవింద్ సింగ్ స్పోర్ట్స్ కాలేజీలో చేర్చారు. కాశ్మీర్ విషాదం గురించి తన తండ్రికి గుర్తుచేసే విషయాలేవీ ప్రస్తావించకుండా తాను ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేవాడినని రైనా చెప్పాడు.
వచ్చే వారం చివరిలో జరగనున్న 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) మెగా వేలంలో రైనా పాల్గొననున్నాడు. అతను చివరిసారిగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున ఆడాడు. 2020 ఆగస్టులో ధోనీతో పాటే రైనా రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ తరఫున 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్‌కింగ్స్, గుజరాత్ సూపర్ జెయింట్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.
Also Read: Lata Mangeshkar's death news: లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook