Dog Volleyball: మనుషుల్లా వాలీబాల్ ఆడుతున్న వీధి శునకాలు.. వీడియో వైరల్!

Dog Volleyball: మనుషులు వాలీబాల్ సహా అనేక క్రీడలను ఆడడం అందరికి తెలిసిన విషయమే! కానీ, మానవులకు పోటీగా ఇప్పుడు శునకాలు కూడా వాలీబాల్ ఆడుతున్నాయి. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అందులో ఏముందో ఇప్పుడు చూడండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 24, 2022, 01:58 PM IST
Dog Volleyball: మనుషుల్లా వాలీబాల్ ఆడుతున్న వీధి శునకాలు.. వీడియో వైరల్!

Dog Volleyball: కుక్కల వికృత చేష్టలు అప్పుడప్పుడు ఇంటర్నెట్‌లో ఎక్కువగా వైరల్ అవుతూ.. నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. చాలామంది శునకాలను పెంచుకుంటుంటారు. ఈ క్రమంలో మనుషులు చేసే కొన్ని పనులను శునకాలు కూడా అనుసరిస్తుంటాయి. అలానే మనుషుల మాదిరి శునకాలు కూడా వాలీబాల్ ఆడుతున్నాయి. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియో ఎంతో సరదాగా ఉంది. 

వీడియోలో ఏముంది?

ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిన ఈ వీడియో ప్రకారం.. ఆరు శునకాలు ఉన్నాయి. వాటిలో తెలుపు, నలుపు రంగుల్లో రెండు శునకాలు.. గోధుమ రంగులో రెండు కుక్కలున్నాయి. ఓ గులాబీ కలర్ బెలూన్ తో అవి ఆడుకుంటున్నాయి. ఆ బెలూన్ ను కింద పడకుండా ఆ శునకాలు గాల్లోకి ఎగిరి కొడుతున్నాయి. మనుషుల మాదిరిగానే ఒకదాని తర్వాత మరొకటి బెలూన్ ను ఆడుకుంటున్నాయి. 

ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన ఈ వీడియోకు ఇప్పటికే వేలాది వ్యూస్, లైక్స్ వచ్చాయి. మరికొంత మంది ఈ వీడియో చాలా ఆహ్లాదంగా ఉందంటూ కామెంట్ చేశారు. ఇంకొంత మంది నెటిజన్లు హార్ట్ ఎమోజీలను పోస్ట్ చేస్తున్నారు.  

Also Read: Security For Mango: మామిడి పండుకు Z+ కేటగిరీ భద్రత.. కారణమేంటో తెలుసా?

Also Read: King Cobra: 12 అడుగులు పొడవున్న భయంకరమైన కళింగ సర్పాన్ని ఎప్పుడైనా చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News