Raw Turmeric Benefits: పచ్చి పసుపుతో ఇన్ని అద్భుతమైన లాభాలా?

Raw Turmeric Benefits:  పచ్చి పసుపు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. ఇది అనేక రకాల వ్యాధులను దూరం చేస్తుంది. దీని ఇతర ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 29, 2022, 04:28 PM IST
  • పచ్చి పసుపుతో ఎన్నో ప్రయోజనాలు
  • మధుమేహం, తదితర వ్యాధులు దూరం
Raw Turmeric Benefits:  పచ్చి పసుపుతో ఇన్ని అద్భుతమైన లాభాలా?

Raw Turmeric Benefits: పచ్చి పసుపుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చలికాలంలో మనిషిని ఫిట్‌గా ఉంచడంలో పసుపు ఎంతో సహాయపడుతుంది. పసుపులో (Raw Turmeric) ఎన్నో ఔషధ గుణలున్నాయి. ఇది అనేక వ్యాధులను దూరం చేస్తుంది. ఆరోగ్యానికి మేలు చేసే పచ్చి పసుపులో కాల్షియం, ఐరన్‌తో సహా అనేక విటమిన్లు ఉన్నాయి. కాబట్టి పసుపు తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మధుమేహానికి చెక్
పచ్చి పసుపు షుగర్ పేషెంట్లకు ఒక వరం. పసుపును సరైన మోతాదులో తీసుకుంటే షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. నిజానికి, పసుపులో ఉండే లిపోపాలిసాకరైడ్ అనే మూలకం రక్తంలో గ్లూకోజ్‌ని తగ్గిస్తుంది.

ముఖానికి మెరుపు
పచ్చి పసుపును అప్లై చేయడం వల్ల ముఖంలో మెరుపు వస్తుంది. పచ్చి పసుపును రోజూ అప్లై చేయడం వల్ల చర్మంపై ఉన్న మచ్చలు కొద్ది రోజుల్లోనే తొలగిపోయి చర్మం మెరిసిపోతుంది. మీరు మీ చర్మాన్ని కాంతివంతంగా చేయాలనుకుంటే  ఇంట్లో పచ్చి పసుపును మాత్రమే ఉపయోగించండి. దీని కోసం, ఒక చెంచా పచ్చి పసుపులో పాలు కలిపి పేస్ట్ లా చేసి... రోజూ ముఖానికి అప్లై చేసి, అరగంట తర్వాత కడిగేయాలి. మీరు దీని నుండి ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారు.

Also Read: Cholesterol Reduce: ఇవి తినడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టవచ్చు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News