Nia Tripathi-Balamevvadu movie : తెలుగు తెరపై ఎక్కువగా ఉత్తరాది భామల హవానే ఉంటుంది. ముంబై నుంచి వచ్చిన భామలే ఇక్కడ హవాను చూపిస్తుంటారు. సనాతన దృశ్యాలు పతాకంపై ధృవన్ కటకం, నియా త్రిపాఠీ జంటగా నటిస్తున్న కొత్త సినిమా ‘బలమెవ్వడు’. వైవిద్య భరితమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా వైద్య రంగంలోని దోపిడీని ప్రశ్నించబోతోంది. ఈ చిత్రానికి సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్నారు. సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్ బి మార్కండేయులు నిర్మిస్తున్నారు. సీనియర్ నటులు ఫృథ్విరాజ్, సుహాసిని, నాజర్ కీలకపాత్రలు పోషిస్తుండట, మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించడంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి.
ఇప్పటికే విడుదల చేసిన టీజర్, మరకతమణి ఎం.ఎం.కీరవాణి పాడిన టైటిల్ సాంగ్ వైరల్ అయ్యాయి. ఈ సినిమా అక్టోబర్ 1 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా హీరోయిన్ నియా త్రిపాఠి మీడియాతో ముచ్చటించింది. మెడికల్ మాఫియా, ప్రధానంగా కోవిడ్ సమయంలో, మందులు ఎలా అందుబాటులో లేవు, మందులు పొందడానికి ప్రజలు భారీగా డబ్బు చెల్లించడం వంటి అనేక విషయాలను మరోసారి చూపించబోతోన్నామని చెప్పుకొచ్చింది. వైద్య పరిశ్రమలోని మంచి, చెడుల గురించే కాకుండా.. స్వచ్ఛమైన, అందమైన ప్రేమకథను కూడా చూపిస్తున్నాం.. ఈ సినిమా చూసిన వారిని తప్పకుండా నిరాశపరచదని ధీమా వ్యక్తం చేసింది.
తన పాత్ర గురించి చెబుతూ.. పరిణిక అనే కారెక్టర్‌ను పోషిస్తోన్నట్టు తెలిపింది. పరిణిక చాలా మెచ్యూర్డ్ అమ్మాయి అలానే తన లైఫ్ లో తను ఒక పెద్ద ఫైటర్ అని ఆమెకు క్యాన్సర్ ఉంటుంది, మరి అలాంటి అమ్మాయి మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా ఎలా పోరాడుతుంది అనేది కథ అంటూ చెప్పుకొచ్చింది. క్యాన్సర్ పేషెంట్‌గా నటించడం సవాలుగా మారిందనట. క్యాన్సర్ పేషెంట్ రోల్ కోసం గుండు కొట్టుకోమన్నారట. దానికి తను కూడా అంగీకరించిందట. కానీ కంటిన్యూటీ సమస్య కారణంగా మళ్లీ మేకప్‌తో వెళ్తామని అన్నారట. కాబట్టి తనకు గుండె కొట్టుకోవాల్సిన అవసరం రాలేదని సీక్రెట్‌ను చెప్పేసింది.
తెలుగులో విజయ్, బన్నీ అంటే ఇష్టమని హీరోయిన్లలో సమంత, సాయి పల్లవి అంటే ఇష్టమని తెలిపింది. తన అలవాట్ల గురించి చెబుతూ.. తనకు డ్యాన్స్ అంటే మహా ఇష్టమని, శయమాక్ దవర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నానని తెలిపింది. చాలా డ్యాన్స్ ఫామ్స్ ట్రై చేస్తుంటానని, తాను కాంటెంపరరీ, హిప్ హాప్, జాజ్, సల్సాలో కూడా శిక్షణ పొందానని తన సీక్రెట్లను బయటపెట్టేసింది.
Also Read : పనిలో మునిగిన రేణూ దేశాయ్.. సెట్‌లోకి జూ. పవర్ స్టార్
Also Read : తెలుగోళ్లు తమిళ సినిమాను తొక్కేస్తున్నారంటూ ఆవేదన.. అసలు సంగతి ఇదీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.