Guru Planet Margi In November: ఆస్ట్రాలజీలో బృహస్పతిని శుభగ్రహంగా భావిస్తారు. ఎవరి జాతకంలో గురుడు శుభస్థానంలో ఉంటాడో వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా వారు దినదినాభివృద్ధి చెందుతారు. మరోవైపు కుండలిలో గురుడు అశుభస్థానంలో ఉంటాడో ఆ వ్యక్తి సంసార జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. నవంబర్ 24న బృహస్పతి మార్గంలోకి రానున్నాడు. ప్రస్తుతం మీనరాశిలో తిరోగమనంలో ఉన్న గురుడు ప్రత్యక్ష సంచారంలోకి (Guru Margi in Pisces 2022) రానున్నాడు. దీని వల్ల మూడు రాశులవారు లాభపడనున్నారు. గురు మార్గి ఈ రాశులవారికి కెరీర్ లో పురోగతిని, ఆకస్మిక ధనలాభాన్ని ఇస్తుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
కర్కాటక రాశి (Cancer): బృహస్పతి మార్గంలో ఉండటం వల్ల మీరు వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి సాధిస్తారు. ఎందుకంటే గురు గ్రహం మీ రాశి నుండి తొమ్మిదవ ఇంటికి వెళ్లబోతోంది. ఇది అదృష్ట ప్రదేశంగా భావిస్తారు. ఈ సమయంలో మీరు ఏ పని మెుదలుపెట్టినా విజయవంతం అవుతారు. వ్యాపారంలో భారీ లాభం ఉంటుంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. విదేశాలకు వెళ్లేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
మీనం (Pisces): గురుగ్రహ సంచారం మీ రాశిలోనే జరుగనుంది. దీని వల్ల మీరు ప్రత్యేక ప్రయోజనాలను పొందనున్నారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. బిజినెస్ విస్తరిస్తుంది. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ఇదే మంచి సమయం. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఫ్లాన్ చేసుకోండి. పెళ్లికాని యువతీయువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది.
వృశ్చికరాశి (Scorpio): బృహస్పతి మార్గంలో ఉండటంతో వృశ్చిక రాశి వారికి మంచి రోజులు మొదలవుతాయి. ఎందుకంటే గురు గ్రహం మీ రాశి నుండి ఐదవ ఇంట్లో సంచరించబోతోంది. దీంతో సంతానం లేని దంపతులకు పిల్లలు కలుగుతారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. ఆర్థికంగా లాభపడతారు.
Also Read: Chandra Grahan 2022: చంద్రగ్రహణం రోజు ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook