Ind vs Ban: 17 ఏళ్ల రికార్డును బద్దలుగొట్టిన బంగ్లాదేశ్ బ్యాటర్లు

Ind vs Ban: టీమ్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ రెండవ వన్డేలో పలు రికార్డులు నమోదయ్యాయి. బంగ్లాదేశ్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో 17 ఏళ్ల రికార్డు బద్దలు గొట్టారు. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 7, 2022, 11:59 PM IST
Ind vs Ban: 17 ఏళ్ల రికార్డును బద్దలుగొట్టిన బంగ్లాదేశ్ బ్యాటర్లు

టీమ్ ఇండియాతో జరిగిన రెండవ వన్డేలో సైతం విజయం సాధించి వన్డే సిరీస్ కైవసం చేసుకుంది బంగ్లాదేశ్. మరోవైపు ఇదే మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. 7వ వికెట్‌కు బంగ్లా బ్యాటర్లు నెలకొల్పిన భాగస్వామ్యం ఓ రికార్డుగా నిలిచింది. 

టీమ్ ఇండియాతో జరిగిన రెండవ వన్డేలో తొలుత బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్‌కు ఇండియా బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్, మొహ్మద్ సిరాజ్‌ల పేస్‌కు బంగ్లా బ్యాటర్లకు కుదేలయ్యారు. 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్ జట్టు. ఈ సమయంలో బంగ్లా బ్యాటర్లు మెహదీ హసన్, మొహ్మదుల్లాలు ఆదుకున్నారు. ఇద్దరూ కలిసి 7వ వికెట్‌కు 148 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఫలితంగా 69 పరుగులకు 6 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్..నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. మెహదీ హసన్ సెంచరీ చేయగా, మొహమ్మదుల్లా 77 పరుగులు చేశాడు. 

ఏడవ వికెట్‌కు హసన్, మొహ్మదుల్లా సాధించిన 148 పరుగులతో 17 ఏళ్ల రికార్డ్ బద్దలైంది. గతంలో 2005లో శ్రీలంక బ్యాటర్లు మహేల జయవర్దనే, ఉపుల్ చందనాలు 7వ వికెట్‌కు 126 పరుగులు సాధించారు. మరోవైపు ఇండియాలో వన్డేల్లో ఇదే అత్యధిక భాగస్వామ్యం. గతంలో 2014లో అనముల్ హక్, ముష్బికర్ రహీమ్ కలిసి 133 పరుగులు చేశారు. ఇక మెహదీ హసన్ మరో రికార్డు నెలకొల్పాడు. 8 లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి సెంచరీ సాధించిన రెండవ బ్యాటర్ అయ్యాడు.

Also read; Ind vs Ban: ఏడాదిలో అత్యధిక వన్డే వికెట్లు, తొలి భారతీయ బౌలర్‌గా మొహమ్మద్ సిరాజ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News