YSRCP MLA Son: బాలయ్య సినిమాకు వైసీపీ ఎమ్మెల్యే కొడుకు ఫ్లెక్సీ.. ఇదేందయ్య ఇదీ!

YSRCP MLA Son ties Flexie for Balakrishna:నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీ విడుదలవుతున్న క్రమంలో ఒక వైసీపీ ఎమ్మెల్యే కుమారుడు ఫ్లెక్సీ కట్టడం హాట్ టాపిక్ అయింది. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 8, 2023, 04:42 PM IST
YSRCP MLA Son: బాలయ్య సినిమాకు వైసీపీ ఎమ్మెల్యే కొడుకు ఫ్లెక్సీ.. ఇదేందయ్య ఇదీ!

YSRCP MLA Son ties Flexie for Balakrishna Veera Simha Reddy Movie: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీ విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో నిర్వహించడానికి ప్రయత్నిస్తే ప్రభుత్వం తరఫున కొంత ఇబ్బందులు కూడా సృష్టించినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో ఒంగోలు శివారులో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించుకోవాల్సి వచ్చింది.

అలాగే వైసీపీ - తెలుగుదేశం మధ్య రాజకీయ పోటీ గురించి కూడా ప్రత్యేకంగా మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఎలా అయినా అధికారం నిలబెట్టుకోవడానికి వైసీపీ ప్రయత్నిస్తుంటే అధికారం చేజిక్కించుకోవడానికి తెలుగుదేశం ప్రయత్నిస్తోంది. బాలకృష్ణ వీరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ మార్పు వెనుక కూడా రాజకీయ కారణాలే ఉన్నాయని తెలుగుదేశం నేతలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. అయితే ఇలాంటి తరుణంలో బాలకృష్ణ మీద గుడివాడ అమర్నాథ్ వంటి వారు కూడా ఎద్దేవా చేస్తూ మాట్లాడారు.

బాలయ్య బాబు కాదని బాలయ్య తాత అని ఈ వయసులో ఆయన సినిమాలు చూడడానికి ఎవరు వస్తారు అంటూ దారుణమైన రీతిలో కామెంట్లు చేశారు. అయితే ఇప్పుడు మాత్రం నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా కోసం  వైసీపీ ఎమ్మెల్యే తనయుడు ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఎవరో కాదు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కుమారుడు. చెన్నకేశవరెడ్డి కుమారుడు ధరణీధర్  రెడ్డి పేరుతో ఒక ఫ్లెక్సీ ఏర్పాటు అయింది. ఇక ఈ సినిమా విడుదల సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అంతేకాదు రానున్న రోజుల్లో ఎమ్మెల్యే కొడుకు కాబోయే నాయకుడు అంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు.

దీంతో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఆయనే పోటీ చేయబోతున్నారనే అంశం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే వీర ధరణీధర్ రెడ్డి పేరుతో నందమూరి బాలకృష్ణ సినిమాకి ఫ్లెక్సీ కట్టడం హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి వైఎస్ జగన్ కూడా ఒకప్పుడు బాలకృష్ణ అభిమాని అని అంటూ ఉంటారు. ఆయన కూడా అప్పట్లో నందమూరి బాలకృష్ణ సినిమా విడుదలవుతుంది అంటే పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టి హడావిడి చేసేవారని టాక్ ఉంది. అయితే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే కుమారుడు బాలకృష్ణ సినిమాకి ఫ్లెక్సీ కట్టడం అనేది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 

Also Read: Pawan Kalyan Comments: బాబును అందుకే కలిశా.. అసలు విషయం చెప్పిన పవన్ కళ్యాణ్!

Also Read: Raghuramakrishnam Raju Alert: చిరంజీవి, బాలయ్య ఫాన్స్ కి అలెర్ట్.. వైసీపీ ఎంపీ కీలక ప్రకటన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 

Trending News