Shakib Al Hasan fires on Umpire for Not Giving wide in BPL 2023: బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్, మాజీ కెప్టెన్ షకిబ్ అల్ హసన్ పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైడ్ ఇవ్వలేదని కోపంతో ఊగిపోయిన షకిబ్.. పెద్దగా అరుస్తూ అంపైర్ మీదకు దూసుకెళ్లడమే ఇందుకు కారణం. చట్‌గావ్ వేదికగా జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) 2023లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం షకిబ్ ఆగ్రహానికి సంబందించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గతంలో కూడా అంపైర్లపై చిందులు వేయడం, వికెట్లను నేలకేసి కొట్టడం లాంటివి షకిబ్ చేసిన విషయం తెలిసిందే.
బీపీఎల్ 2023లో భాగంగా ఫార్చూన్ బరిషల్ జట్టు తరఫున షకిబ్ అల్ హసన్ ఆడుతున్నాడు. సిల్హెట్ స్ట్రైకర్స్‌తో ఫార్చూన్ బరిషల్ తలపడింది. ఈ మ్యాచ్‌లో షకీబల్ హసన్ 67 పరుగులతో రాణించాడు. అయితే సిల్హెట్ సీమర్ రెజౌల్ రెహమాన్ రాజా వేసిన ఓ బంతి షకీబల్ పై నుంచి వెళ్లింది. అది వైడ్ అని నమ్మిన షకీబల్.. స్క్వేర్ లెగ్ అంపైర్ మహ్ఫుజుర్ రెహమాన్ వైపు చూశాడు. తొలి బౌన్సర్ అని అంపైర్ సిగ్నల్ ఇవ్వడంతో షకీబ్ కోపంతో ఊగిపోయాడు. అదే సమయంలో లెగ్ అంపైర్ వైపు వెళ్లాడు.
క్రీజు వదిలి లెగ్ అంపైర్ దగ్గరకు వెళ్లిన షకిబ్ అల్ హసన్.. అతడితో వాదనకు దిగాడు. ఆపై స్ట్రయిట్ అంపైర్‌తో కూడా మాట్లాడిన తర్వాత ఇక చేసేదేం లేక షకిబ్ మళ్లీ బ్యాటింగ్ చేయడానికి వెళ్లిపోయాడు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. 'షకిబ్ అల్ హసన్ ఇది మంచి పద్ధతి కాదని' కామెంట్స్ చేస్తున్నారు. మాజీలు కూడా షకిబ్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Shakib Getting furious with an umpire for not giving wide #BPL23 #BPL2023 pic.twitter.com/1rrp8Yl5Dy
— Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) January 7, 2023
2021 ధాకాలో జరిగిన ప్రీమియర్ లీగ్‌లో సైతం షకిబ్ అల్ హసన్ ప్రవర్తన వివాదాస్పదమైంది. అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం తెచ్చుకున్న షకిబ్.. అంపైర్ ఎదురుగా ఉన్న వికెట్లు పీకేశాడు. అప్పుడు షకిబ్‌ను విలన్‌గా చిత్రీకరించేలా మీడియా ప్రయత్నిస్తోందంటూ అతడి భార్య ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం షకిబ్ అభిమానులు, టోర్నీ నిర్వహకులకు క్షమాపణలు తెలిపాడు. తాను కోపాన్ని నియంత్రించుకోవడంలో విఫలమయ్యానంటూ అందరి ముందు ఒప్పుకున్నాడు.
Also Read: Trikona Raj Yoga 2023: కేంద్ర త్రికోణ రాజయోగం 2023.. ఈ 3 రాశుల వారిపై కురవనున్న డబ్బు వర్షం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.