Consular Fee: గల్ఫ్‌ కార్మికులకు భారం.. కేంద్రం పెంచిన కాన్సులర్‌ ఫీజుతో ఇబ్బందులు

Union Govt Latest Increased Indian Passport And Consular Service Fees: పొట్ట చేతపట్టుకుని గల్ఫ్‌ దేశాలకు వెళ్తున్న కార్మికులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్‌ ఇచ్చింది. పాస్‌పోర్టు, కాన్సులర్‌ సేవలకు సంబంధించిన ఫీజులు భారీగా పెంచడంతో గల్ఫ్‌ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 24, 2025, 05:50 PM IST
Consular Fee: గల్ఫ్‌ కార్మికులకు భారం.. కేంద్రం పెంచిన కాన్సులర్‌ ఫీజుతో ఇబ్బందులు

Passport And Consular Service Fees: తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్రాల నుంచి గల్ఫ్‌కు వెళ్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల భారీ షాక్‌ ఇచ్చింది. పాస్‌పోర్టు, కాన్సులర్‌ ఫీజులను భారీగా పెంచేయడంతో గల్ఫ్‌కు వెళ్లాలనుకున్న వారికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి గల్ఫ్‌ దేశాలకు వెళ్లి కొంత సంపాదించాలని భావిస్తున్న వారికి అసలు అక్కడకు వెళ్లేందుకు మరింత అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో గల్ఫ్‌ కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: BRS Party Joinings: ఎమ్మెల్సీ ఎన్నికల ముంగిట రేవంత్ రెడ్డికి భారీ షాక్‌.. బీఆర్‌ఎస్‌లోకి వలసలు

గల్ఫ్‌ ఛార్జీల భారంపై టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి ఆందోళన చేపట్టారు. ఈ ఫీజులు తగ్గించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, విదేశాంగ మంత్రి జైశంకర్‌కు సోమవారం మెయిల్ ద్వారా లేఖ రాశారు. ఇండియన్ పాస్‌పోర్ట్ ఫీజును తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. పేద గల్ఫ్ కార్మికులపై నాలుగు రెట్ల ఫీజుల భారం మోపిందని.. కేంద్ర ప్రభుత్వం కొత్త ఔట్‌సోర్సింగ్ విధానంతో గల్ఫ్‌ దేశాలలో పాస్ పోర్ట్, కాన్సులర్ సేవలను ప్రైవేటీకరించి నాలుగు రెట్ల ఫీజులు పెంచారని వివరించారు. ప్రవాసీ కార్మికులు ఇది మోయలేని భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన పాస్ పోర్ట్, కాన్సులర్ సేవల ఫీజులను వెంటనే తగ్గించాలని మంద భీంరెడ్డి డిమాండ్‌ చేశారు.

Also Read: Telangana Jobs: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. తెలంగాణలో 14,236 ఉద్యోగాల భర్తీ.. జీతాలు, అర్హతలు ఇవే!

విదేశీ మారక ద్రవ్యాన్ని పొందే దేశాలలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండగా.. భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో సగానికి పైగా సొమ్ము యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఓమాన్, ఖతార్, బహరేన్ ఆరు అరబ్ గల్ఫ్ దేశాల నుంచే వచ్చిందని మంద భీంరెడ్డి గుర్తుచేశారు. ప్రవాసీ కార్మికులు దేశానికి ఆర్థిక జవాన్లుగా నిలుస్తున్నారని చెప్పారు. గల్ఫ్ దేశాలలో 88 లక్షల మంది వలస కార్మికులు నివసిస్తున్నారని.. అలాంటి వారికి తాజాగా పెంచిన ఫీజులు భారంగా మారాయని తెలిపారు. ఇతర దేశాలు ప్రవాసులకు ప్రోత్సాహాకాలు ఇస్తుంటే భారత్ మాత్రం ఎన్నారైలను పీడిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గల్ఫ్‌లో ఇబ్బంది పడుతున్న కార్మికులకు పాస్‌పోర్ట్, కాన్సులర్ సేవల ఫీజుల పెంపుతో మరింత కష్టంగా మారిందని టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి వాపోయారు. ప్రవాసులకు భారత ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు.

ఫీజుల పెంపు ఇలా...
గల్ఫ్ దేశాలలో భారత పాస్‌పోర్ట్, కాన్సులర్ సేవల ఫీజు పెంపు ఇలా ఉంది.

సౌదీ అరేబియా ప్రస్తుతం 200-300 రియాలు గతంలో 50-75
యూఏఈ ప్రస్తుతం 200-350 దిర్హామ్‌లు గతంలో 50-100
ఓమన్‌ 25-35 రియాలు గతంలో 5-10
బహ్రెయిన్‌ 20-30 దినార్లు గతంలో 5-10
ఖతార్  ప్రస్తుతం150 రియాలు గతంలో 200

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News