KTR Dallas Speech: 'ఉన్నా పోయినా మాకు తెలంగాణ ఫస్ట్‌..' డల్లాస్‌ గడ్డపై కేటీఆర్‌ గర్జన

Ex Minister KTR Dallas Meeting Full Josh Into NRIs: 'అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా మాకు తెలంగాణే ఫస్ట్' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. అమెరికాలోని డల్లాస్‌ గడ్డపై కీలక ప్రసంగం చేసి ఎన్నారైలో తెలంగాణ భావాన్ని నింపి వారిలో జోష్‌ తీసుకువచ్చారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 2, 2025, 08:06 PM IST
KTR Dallas Speech: 'ఉన్నా పోయినా మాకు తెలంగాణ ఫస్ట్‌..' డల్లాస్‌ గడ్డపై కేటీఆర్‌ గర్జన

  KTR America Tour: తాము ఎక్కడున్నా.. ఏ పరిస్థితుల్లో ఉన్నా తమ తొలి ప్రాధాన్యం తెలంగాణ అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. మళ్లీ మూడేళ్లలో తిరిగి అధికారంలోకి వస్తాం.. తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి మాతృభూమి రుణం తీర్చుకోవాలని ఈ సందర్భంగా ఎన్నారైలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. 'ఓట్లలో వెనుకబడ్డామేమో కానీ.. తెలంగాణను ప్రేమించడంలో ఎన్నడూ వెనకబడలేదు' అని కేటీఆర్ తెలిపారు.

Add Zee News as a Preferred Source

Also Read: RBI 2000 Notes: రూ.2000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన.. మళ్లీ మార్కెట్‌లోకి వస్తాయా?

'14 ఏళ్ల అలుపెరగని పోరాటంతో సాధించిన తెలంగాణ రాష్ట్రం, ఉద్యమ రథసారథి కేసీఆర్ పాలనలో కేవలం పదేళ్ల వ్యవధిలోనే దేశంలోనే నెంబర్ వన్ స్టేట్‌గా ఎదిగింది' అని కె తారకరామారావు తెలిపారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ స్టార్టప్ స్టేట్‌గా తెలంగాణ నిలిచిందని గుర్తుచేశారు. ఇంత అమోఘమైన అభివృద్ధిని సాధించిన రాష్ట్రం దేశంలోనే మరొకటి లేదని స్పష్టం చేశారు. తెలంగాణను అద్భుత అవకాశాల అక్షయపాత్రగా, ఇండియాకే ఎకనామిక్ ఇంజన్‌గా తీర్చిదిద్దిన ఘనత ముమ్మాటికీ కేసీఆర్‌కే దక్కిందని చెప్పారు.

Also Read: Retirement Age: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్‌.. రిటర్మైంట్‌ వయస్సు పెంపు

అమెరికాలోని డల్లాస్‌లోని డాక్టర్ పెప్పర్ ఎరీనాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కీలక ప్రసంగం చేసి తెలంగాణ గొప్పతనంతోపాటు ఉద్యమ చరిత్ర.. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమాలను వివరించారు. అనంతరం మూడేళ్లలో ఏం చేయాలనేది ఎన్నారై బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులకు అమెరికా గడ్డ నుంచి పిలుపునిచ్చారు.

'సంకల్పం, పట్టుదల, చిత్తశుద్ధి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని తెలంగాణ రాష్ట్రం దేశానికి చాటిచెప్పింది. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో, పదేళ్ల తెలంగాణ ఉజ్వల ప్రయాణంలో.. అడుగడుగునా కేసీఆర్ చారిత్రక ముద్ర వేశారు. సమైక్యపాలకుల వివక్షతో దశాబ్దాలపాటు పడావుబడ్డ తెలంగాణ దీనస్థితిని, కేసీఆర్ హయాంలో పదేళ్లలోనే  సుజల, సుఫల, సస్యశ్యామల తెలంగాణగా ఎదిగింది' అని కేటీఆర్‌ వివరించారు. ట్రంప్ విధానాలతో ఇబ్బందులు పడుతున్న తెలుగు విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు. అమెరికాలో లీగల్ సెల్ ఏర్పాటుచేసి తెలుగు విద్యార్థులను అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

 

 

'అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సర్వస్వాన్ని ధారపోసిన ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుకునే సందర్భం ఇది. అభివృద్ధి, ఆత్మ గౌరవం, తెలంగాణ అస్తిత్వ లక్ష్యాల సాధన కోసం 20 ఏళ్ల కిందట ఒక స్వప్నం చిగురించింది. ఒకే ఒక్కడుగా బయలుదేరి ఉద్యమ బాట నుంచి తప్పుకుంటే రాళ్లతో కొట్టి చంపండి అని పిలుపునిచ్చిన ఒకే ఒక నాయకుడు కేసీఆర్‌. శూన్యం నుంచి సునామి సృష్టించి.. తెలంగాణ మిషన్ ఇంపాజిబుల్ అన్న పరిస్థితిని మిషన్ పాజిబుల్ అన్న పరిస్థితికి తెచ్చి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్' అని ఉద్యమ చరిత్రను కేటీఆర్‌ వివరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook 

  

  

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News