Weather Update: నేడు పిడుగులతో కూడిన వర్షాలు.. ఈ జిల్లాల్లో 40 కీమీ వేగంతో ఈదురు గాలులు ..

weather Update In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో నేడు వాతావరణం ఎలా ఉంటుంది? అంచనా వేసింది ఐఎండీ. ప్రధానంగా నేడు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు ఆంధ్ర ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో కురుస్తాయని ఏపీఎస్‌డీఎంఏ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలలోని ప్రజలకు జాగ్రత్తలు కూడా సూచించింది. 
 

1 /5

 ఆంధ్రప్రదేశ్‌లో నిన్నటి నుంచి భిన్న వాతావరణం ఏర్పడుతుంది. ప్రధానంగా ఎండ ఎక్కువగానే ఉంటుంది. మరోవైపు వర్షాలు కూడా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఉత్తరాంధ్ర జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా పడతాయని ఏపీఎస్‌డీఎంఏ అంచనా వేసింది 

2 /5

 ప్రధానంగా చిత్తూరు జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక పల్నాడులో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఈ భిన్నమైన వాతావరణ పరిస్థితిలో పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.   

3 /5

 ఇక నిన్నటి రాత్రి నుంచి మన్యం జిల్లాలో పెద్ద మేరంగిలో 47.5 మిల్లీమీటర్ల వర్షం కూడా పడింది. నంద్యాల జిల్లా దొర్నపాడు లో కూడా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఇలాంటి భిన్న వాతావరణ పరిస్థితులు ఏపీలో ఏర్పడుతున్నాయి.   

4 /5

 మరోవైపు తెలంగాణలో కూడా రెండు రోజులపాటు పగటిపూట ఎండ సాయంత్రం వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. ముఖ్యంగా కరీంనగర్చ, పెద్దపల్లి, ములుగు, భద్రాది, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ సిద్దిపేట, యాదాద్రి రంగారెడ్డి ,హైదరాబాద్ ,మేడ్చల్ జిల్లాల్లో వర్షాలు పడతాయని హెచ్చరించింది   

5 /5

ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది  వాతావరణ శాఖ. ఈ ప్రాంతాల్లో 40 కిలోమీటర్ల వేగంతో ఈ ప్రాంతాల్లో ఈదురు గాలులు కూడా వీస్తాయని చెప్పింది. ప్రధానంగా ఎండ సమయంలో అత్యంత అవసరం ఉంటే తప్ప బయటకు రాకూడదని హెచ్చరించింది.