Gratuity Payment In Telugu: 10 సంవత్సరాల సర్వీస్‌కి గాను ప్రతి కంపెనీ ఎంతో కొంత మొత్తంలో గ్రాట్యుటీ ఉద్యోగికి చెల్లిస్తుంది. 5 సంవత్సరాలపాటు పని చేసిన వారికి కూడా కంపెనీ ఇది అందిస్తుంది. అయితే దీనిని ఎలా పొందాలో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Gratuity Payment In Telugu: ఏదైనా ఒక కంపెనీలో దీర్ఘకాలంగా ఉద్యోగం చేస్తే కంపెనీ తప్పకుండా ఎంతో కొంత మొత్తంగా గ్రాట్యుటీ అందిస్తుంది. ముఖ్యంగా 10 ఏళ్లు సర్వీస్ చేసే వారికి కంపెనీ తప్పకుండా లక్షల రూపాయలను ఉద్యోగుల అకౌంట్లో జమ చేస్తుంది. అయితే మీరు కూడా ఎప్పటినుంచో ఏదైనా కంపెనీలో పని చేస్తున్నారా? భారీ మొత్తంలో గ్రాటిట్యూడ్ ఎలా పొందాలో? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
1/5గ్రాట్యుటీ చెల్లింపు చట్టం 1972 ప్రకారం.. ఏదైనా సంస్థలో పనిచేసినప్పుడు గరిష్టంగా 20 లక్షల రూపాయల వరకు గ్రాట్యుటీని ఎలాంటి పనులు లేకుండా పొందవచ్చు. ఇంతకీ గ్రాట్యుటీ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? గ్రాట్యుటీ అంటే దీర్ఘకాలిక సేవలను గుర్తించి ప్రతిఫలంగా కంపెనీలు ఉద్యోగులకు కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. ఇలా ఏక మొత్తంలో ఉద్యోగులకు చెల్లించేదే గ్రాట్యుటీగా పిలుస్తారు.
2/5ఉద్యోగి ఏదైనా ఒక కంపెనీలో కనీసం ఐదు సంవత్సరాలపాటు నిరంతరం సేవలందిస్తేనే గ్రాట్యుటీ చెల్లిస్తారు. ఈ దీనిని పదవి విరమణ అనంతరం లేదా ఉద్యోగి రాజీనామా చేసినప్పుడు, ఉద్యోగి మరణించినప్పుడు దీనిని చెల్లిస్తారని సమాచారం. ఈ గ్రాట్యుటీ అనేది 10 కంటే ఎక్కువ మంది పని చేసే కంపెనీలో అందుబాటులో ఉంటుంది.
3/5అధికారికంగా పనిచేసే ప్రతి కంపెనీలలో గ్రాట్యుటీ ఆప్షన్ ఉంటుంది. దీనికి అప్లికేబుల్ అయిన వారు తప్పకుండా కంపెనీ 30 రోజుల్లో మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే ఏడు శాతం వరకు వడ్డీని వసూలు చేసే అవకాశాలు కూడా కల్పిస్తోంది. దీనిని సాధారణ ఫార్ములా లాగానే లెక్కిస్తారు. ఈ (15 × చివరి జీతం × సర్వీస్ సంవత్సరాలు) / 26 (Last drawn salary x 15 x Number of completed years of service)ఫార్ములా ప్రకారం లెక్కిస్తారు.
4/5ప్రస్తుతం గ్రాట్యూటీ గరిష్ట పరిమితి 20 లక్షలగా ఉంది. ఇక దీనిని 75 వేల జీతం పై లెక్కిస్తే.. ఈ జీతానికి డిఆర్ అలవెన్స్ సున్నా అనుకుంటే.. వీరు 10 సంవత్సరాలకు పైగా సేవలందించి ఉంటే.. గ్రాట్యూటీ ఫార్ములా ప్రకారం.. చెల్లించాల్సిన పూర్తి గ్రాట్యూటీ రూ.4,32,692 అవుతుంది. ఇక డియర్ అలవెన్స్ 20% అయితే.. మొత్తం గ్రాట్యుటీ రూ.5,19,231 అవుతుంది.
5/5కాబట్టి మీరు ఏదైనా కంపెనీలో పది సంవత్సరాల కంటే ఎక్కువగా పని చేసి ఉంటే తప్పకుండా గ్రాట్యుటీ పొందవచ్చు. ఐదు సంవత్సరాల పాటు సర్వీస్ చేసిన వారు కూడా భారీ మొత్తంలో గ్రాట్యుటీ పొందిన వారున్నారు. అయితే ఇది మీకు చెల్లించే జీతంపై కూడా ఆధారపడి ఉంటుంది. మీకు భారీ మొత్తంలో జీతం ఉంటే ఈ గ్రాట్యుటీ కూడా భారీగా పొదవచ్చు.