Honda Activa Electric Scooter: త్వరలోనే హోండా కంపెనీ నుంచి ఈ స్కూటర్స్ విడుదల కాబోతున్నాయి. హోండా యాక్టివా పేరుతో ఈ స్కూటర్స్ విడుదల కాబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Honda Activa Electric Scooter Price: ప్రముఖ మోటార్ సైకిల్ కంపెనీ తమ అత్యంత ప్రజాదరణ పొందిన హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది మార్కెట్లో ఇదివరకే ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ల కంటే.. అద్భుతమైన శక్తివంతమైన ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నట్లు రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా దీని బేస్ వేరియంట్ దాదాపు 102 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తున్నట్లు సమాచారం. ఈ స్కూటర్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1/5హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.17 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దీని హై ఎండ్ వేరియంట్ రూ 1.52 లక్షల వరకు ఉండబోతున్నట్లు వార్తలు. అలాగే దీరూ. 1.17 లక్షలనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 102 కి.మీ వరకు మైలేజీని అందిస్తుంది. ఇప్పటికే ఈ స్కూటర్ కు సంబంధించిన మైలేజీ పరీక్షలను కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది.
2/5ఈ హోండా యాక్టివా ఈ స్కూటర్లో 1.5kWh బ్యాటరీ కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కూడా ఇందులో అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ స్కూటర్ కు సంబంధించిన అనేక వివరాలు లీకయ్యాయి. అలాగే ఇది ప్రత్యేకమైన డిజైన్ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
3/5హోండా యాక్టివా ఈ స్కూటర్ బ్యాటరీ స్వాపింగ్ ప్లాన్తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అంటే బ్యాటరీ చార్జ్ చేసుకోవడానికి హోండా కు సంబంధించిన స్వాపింగ్ స్టేషన్కు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఇటీవలే ఈ స్కూటర్కు సంబంధించిన ఎన్నో రకాల ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి.. వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
4/5మొదటగా హోండా యాక్టివా ఈ స్కూటర్స్ భారతదేశంలోనే విడుదల చేయబోతోంది. అలాగే బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ను బెంగళూరులో నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ స్వాపింగ్ పద్ధతి ద్వారా గందరగోళం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే చిన్న చిన్న సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
5/5ప్రముఖ హోండా కంపెనీ త్వరలోనే ఈ స్కూటర్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరలోనే ఈ స్కూటర్స్ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. కాబట్టి అత్యంత తక్కువ ధరలోని ఈ స్కూటర్స్ కొనుగోలు చేయాలనుకునేవారు మరికొన్ని రోజుల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది.