Oppo A5 Pro Price: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో భారత కస్టమర్స్‌కి గుడ్ న్యూస్ తెలిపింది. మార్కెట్లోకి మరో బడ్జెట్ మొబైల్‌ను విడుదల చేసింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Oppo A5 Pro Price: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో మార్కెట్లోకి ఎప్పుడు స్మార్ట్ ఫోన్స్‌ను విడుదల చేసిన అద్భుతమైన ఫీచర్స్‌తో ప్రీమియం డిజైన్‌తో విడుదల చేస్తుంది. అయితే మార్కెట్లో లాంచ్ అవుతున్న అద్భుతమైన కెమెరా స్మార్ట్ ఫోన్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒప్పో కంపెనీ మార్కెట్లోకి ఓ అద్భుతమైన మొబైల్ ను విడుదల చేసింది. ఇది ప్రీమియం ఫీచర్స్ తో అందుబాటులోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏంటో, ఏయే ధరల్లో అందుబాటులో ఉందో ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ఒప్పో తమ కొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ ఒప్పో A5 ప్రో (Oppo A5 Pro)పేరుతో ఈరోజు భారత మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. అయితే గతంలో సక్సెస్ అయిన ఏ సిరీస్ ను దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్ ను విడుదల చేశారు. ఇది మోస్ట్ పవర్ఫుల్ 50MP కెమెరా అందుబాటులోకి వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది.
అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ అద్భుతమైన డిజైన్ ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ధరల వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్ వేరియంట్ ధర రూ.17 వేల నుంచి ప్రారంభమవుతుంది.
ఇక Oppo A5 Pro 5G స్మార్ట్ ఫోన్ రెండో వేరియంట్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో అందుబాటులో ఉంది. దీని ధర కూడా రూ.19,999తో ప్రారంభం కాబోతోంది. ఈ మొబైల్ రెండు కలర్ ఆప్షన్స్ తో లభిస్తోంది. ఇప్పటికే వీటిని ప్రముఖ ఈ కామర్స్ కంపెనీలు అమెజాన్ తో పాటు ఫ్లిప్కార్ట్ లో కూడా అందుబాటులో ఉంచారు.
లాంచింగ్ ఆఫర్స్‌లో భాగంగా వీటిని కొనుగోలు చేసే వారికి ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా ఒప్పో A5 ప్రో (Oppo A5 Pro)స్మార్ట్ ఫోన్లను SBI, IDFC FIRST బ్యాంక్, BOB ఫైనాన్షియల్, ఫెడరల్ బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి ఏకంగా రూ.1,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ఈ బ్యాంకులపై నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
ఒప్పో A5 ప్రో (Oppo A5 Pro) స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ 6.67-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో విడుదల చేసింది. అంతేకాకుండా మోస్ట్ పవర్ఫుల్ 5800mAh పెద్ద బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. అలాగే దీనికి కంపెనీ 45W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కూడా అందిస్తోంది. ఇక ఇవే కాకుండా ఇందులో అనేక రకాల ప్రత్యేకమైన ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.