Realme Gt 8 Pro Price In India: భారత మార్కెట్‌లోకి రియల్ మీ కంపెనీ తమ ప్రీమియం Gt సిరీస్ మొబైల్‌ను విడుదల చేయబోతోంది. ఇది చాలా ప్రత్యేకమైన ఫీచర్లతో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉంటుంది.
Realme Gt 8 Pro Price In India Launch Date: ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ రియల్ మీ మార్కెట్‌లోకి అద్భుతమైన మొబైల్‌ను విడుదల చేసింది. Gt సిరీస్‌లో మార్కెట్‌లోకి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఇది రియల్ మీ జిటి 8 ప్రో(Realme GT8 Pro)పేరుతో అందుబాటులోకి వచ్చింది. దీనిని కంపెనీ మొదటగా చైనాలో విడుదల చేసింది. అయితే అతి త్వరలోనే భారత మార్కెట్‌లోకి విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేస్తే ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రాబోతోంది.
రియల్ మీ జిటి 8 ప్రో (Realme GT8 Pro)స్మార్ట్ ఫోన్ కంపెనీ నవంబర్ 20వ తేదీన మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. ఇది గత మోడల్స్ కు సక్సెస్ గా అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. జిటి మోడల్స్‌కి మార్కెట్‌లో అద్భుతమైన డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని 8 ప్రోను అందుబాటులోకి తీసుకువచ్చింది.
రియల్ మీ జిటి 8 ప్రో ఎంతో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది చాలా ప్రత్యేకమైన 2K AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అలాగే ఇది 7,000 నిట్‌ల పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన 7,000 mAh బ్యాటరీతో విడుదల చేయబోతోంది.
అలాగే ఈ మొబైల్ బ్యాటరీని ఛార్జ్ చేసేందుకు 120 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కూడా కలిగి ఉంటుంది. ఈ మొబైల్ వెనక భాగంలో త్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులోని కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్టుతో 50-మెగాపిక్సెల్ రికో GR యాంటీ-గ్లేర్ ప్రైమరీ కెమెరాతో అందుబాటులోకి రాబోతోంది.
ఇక ప్రధాన కెమెరా 200-మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఇదే కాకుండా అదనంగా 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కెమెరాలతో 8K రిజల్యూషన్ వీడియోను కూడా ఎంతో సులభంగా రికార్డు చేయొచ్చు. ఈ మొబైల్ Android 16 ఆధారంగా Realme UI 7.0 ఆపరేటింగ్ సిస్టమ్ పై రన్ అవుతుంది.
ఇక ఈ రియల్ మీ జిటి 8 ప్రో (Realme GT8 Pro) మొబైల్‌కు సంబంధించిన కనెక్టివిటీ ఫీచర్ల వివరాల్లోకి వెళితే.. ఇందులో కంపెనీ ప్రత్యేకమైన బ్లూటూత్, వై-ఫై, NFC వంటి ఫీచర్లను కూడా అందిస్తున్నారు. అలాగే ఇందులో చాలా ప్రత్యేకమైన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఇది వివిధ రకాల వేరియంట్‌లో విడుదలైనప్పటికీ.. అన్ని వేరియంట్లు ఒకే రకమైన డిస్ప్లేను కలిగి ఉంటాయి.