Epfo Pension Diwali Gift: 21 కోట్ల ప్రైవేటు ఉద్యోగులకు కేంద్రం దీపావళి కానుక.. ప్రతి ఒక్కరి అకౌంట్లోకి రూ.20 వేల పెన్షన్!

Epfo Pension Diwali Gift In Telugu: దీపావళి సందర్భంగా మోడీ సర్కార్ ప్రైవేటు ఉద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్ తెలుపబోతోంది. యూనివర్సిటీ పెన్షన్ సిస్టం తరహాలో పదవి విరమణ పొందిన ప్రతి ప్రైవేటు ఉద్యోగికి.. ప్రత్యేకమైన పెన్షన్ను అందించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ప్రతి ప్రైవేటు ఉద్యోగికి పదవి విరమణ పొందిన తర్వాత గరిష్టంగా రూ.20 వేల వరకు పెన్షన్ లభిస్తుంది..

Epfo Pension Diwali Gift In Telugu: ప్రతి ఉద్యోగి పదవి విరమణ పొందిన తర్వాత ఎంతో కొంత పెన్షన్ ఆశిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ అనంతరం ప్రభుత్వమే అందిస్తుంది. కానీ ప్రైవేటు ఉద్యోగులకే ఎలాంటి పెన్షన్స్ సౌకర్యం ఉండదు. దీనిని దృష్టిలో పెట్టుకొని చాలామంది ప్రైవేట్ పెన్షన్ పథకాలకు ముందుగానే డబ్బులు కడుతున్నారు.. అయితే ఇలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ తెలుపబోతోంది. దీపావళి కానుకగా మోదీ సర్కార్ ప్రైవేటు ఉద్యోగులకు కూడా ప్రత్యేకమైన పెన్షన్ పథకాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 
 

1 /7

ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కష్టపడి వారి సేవలను ప్రభుత్వానికి కంపెనీలకు అందిస్తారు. కొంతమంది 40 సంవత్సరాలపాటు సేవలందించిన వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీలలో 50 సంవత్సరాల వరకు కూడా సేవలందించిన వారు ఉన్నారు. అయితే వీరు పదవి విరమణ పొందిన తర్వాత తప్పకుండా ఎంతో కొంత పెన్షన్ పొందాలని చూస్తున్నారు. ఇలాంటి వారికే కేంద్రం గుడ్ న్యూస్ తెలుపబోతోంది.   

2 /7

ప్రైవేటు ఉద్యోగుల కోసం పదవి విరమణ తర్వాత పెన్షన్ పొందడానికి ప్రత్యేకమైన పెన్షన్ పథకాన్ని రూపొందించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని అమలు దీపావళి లోపే జరిగే అవకాశాలున్నట్లు కూడా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పెన్షన్ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..

3 /7

ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ ఖాతాలను అందిస్తుంది.. ఈ ఖాతాల ద్వారా జీవితంలో ఎంతో కొంత మొత్తాన్ని ఈపీఎఫ్ ఖాతాలో కంపెనీలు జమచేస్తాయి.. ఇలా జమైన డబ్బులను ప్రైవేటు ఉద్యోగులకు పెన్షన్ రూపంలో అందించేందుకు కేంద్రం ప్రత్యేకమైన పథకాన్ని రూపొందించబోతోంది.   

4 /7

దీంతో కనీస వయస్సుతో పదవి విరమణ పొందిన ప్రతి ప్రైవేటు ఉద్యోగికి ప్రతి నెల ఎంతో కొంత మొత్తంలో పెన్షన్ లభిస్తుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు యూనివర్సిటీ పెన్షన్ సిస్టంలో భాగంగా ఇప్పటికే పెన్షన్ వస్తోంది. దీని తరహాలోనే ప్రైవేటు ఉద్యోగులకు కూడా ప్రత్యేకమైన పెన్షన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించబోతోంది.   

5 /7

యూనివర్సిటీ పెన్షన్ సిస్టం తరహాలో ప్రైవేటు ఉద్యోగులకు కూడా ప్రత్యేకమైన పెన్షన్ పథకం అందుబాటులోకి వస్తే.. పదవి విరమణ పొందిన కొన్ని కోట్ల ప్రైవేటు ఉద్యోగులకు మేలు జరుగుతుంది. ఇప్పటికే ఈ ప్రత్యేకమైన ప్రైవేట్ ఎంప్లాయిస్ రిటైర్మెంట్ పెన్షన్ స్కీమ్‌కు సంబంధించిన వివరాలను కేబీనెట్‌లో కూడా చర్చించినట్లు సమాచారం.   

6 /7

అతి త్వరలోనే ప్రైవేట్ ఉద్యోగులకు సంబంధించిన ఈ పెన్షన్స్ పథకం  బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్లు కూడా గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే ఇది అతి త్వరలోనే జరగబోతున్నట్లు సమాచారం. ఈ బిల్లు ఆమోదం పొందితే ప్రతి ప్రైవేటు ఉద్యోగి జీతం కూడా విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ కూడా పెరిగి.. ఆ ఖాతాలు భారీగా డబ్బులు జమవుతాయి.   

7 /7

ఈపీఎఫ్ ఖాతాలోజమైన డబ్బులను కేంద్ర ప్రభుత్వం పదవి విరమణ పొందిన తర్వాత ప్రైవేటు ఉద్యోగులకు ప్రతినెల పెన్షన్ రూపంలో అందించబోయే అవకాశాలున్నట్లు సమాచారం. ఇదే ఒకవేళ నిజమైతే.. ప్రైవేటు ఉద్యోగి జీతం, ఈపీఎఫ్ ఖాతా కాంట్రిబ్యూషన్ను బట్టి గరిష్టంగా రూ.20 వేల వరకు ప్రతినెల పెన్షన్ పెన్షన్ లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ పెన్షన్ పథకం అమలు అయితే దాదాపు 21 కోట్ల మంది పదవి విరమణ పొందిన ప్రైవేటు ఉద్యోగులకు మేలు జరుగుతుంది.