Massive Protests In Telangana Districts Against KCR CBI Probe: దురుద్దేశం.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుపై సీబీఐ విచారణకు ఆదేశించడంపై తెలంగాణలో రెండో రోజు తీవ్రస్థాయిలో ఆందోళనలు జరిగాయి. తెలంగాణలోని అన్ని జిల్లాలో నిరసనలు కొనసాగాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
1/8కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఆదేశించడంపై తెలంగాణలో రెండో రోజు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. కేసీఆర్, హరీశ్ రావుపై కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్న రేవంత్ రెడ్డిపై యావత్ తెలంగాణ భగ్గుమంటోంది. రెండో రోజు మంగళవారం తెలంగాణవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. వాటి వివరాలు, ఫొటోలు ఇలా ఉన్నాయి.
2/8కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలకు నిరసనగా ఆదిలాబాద్‌లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. కొమరం భీమ్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు రాస్తారోకో నిర్వహించగా.. మాజీ మంత్రి జోగు రామన్నను పోలీసులు అరెస్ట్ చేశారు.
3/8ఆదిలాబాద్‌లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమకారులు, గులాబీ శ్రేణులు నినాదాలు చేశారు.
4/8ఖబడ్దార్ రేవంత్ రెడ్డి నినాదాలతో గద్వాల్ దద్దరిల్లింది. కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీల నాటకాలపై గద్వాల్‌లో భారీ ఎత్తున నిరసన ప్రదర్శన జరిగింది. గద్వాలలోని కృష్ణవేణి చౌక్ దగ్గర నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి.. రాస్తారోకో చేపట్టారు. ఈ నిరసనలో బీఆర్‌ఎస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి బాసు హనుమంతు నాయుడుతోపాటు పెద్ద ఎత్తున గులాబీ శ్రేణులు హాజరయ్యాయి.
5/8తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరంపై, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి కుట్రలకు నిరసనగా నిజామాబాద్‌లో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది.
6/8కాళేశ్వరం ప్రాజెక్టపై రేవంత్ రెడ్డి కుట్రలకు నిరసనగా కామారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎంకేముజీబుద్దీన్ నాయకత్వంలో రాస్తారోకో జరిగింది. కామారెడ్డి, నిజాంసాగర్ తదితర మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకోలు జరిగాయి.
7/8కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై నిరాధార ఆరోపణలు చేస్తూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వేధింపులకు పాల్పడడంపై ఇబ్రహీంపట్నంలో తెలంగాణ ఉద్యమకాలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. అంబేడ్కర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు.
8/8కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కుట్రలకు నిరసనగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గం మధిరలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. నల్ల జెండాలతో భారీ బైక్ ర్యాలీ చేపట్టి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.