3 days School Holidays in This week: సెప్టెంబర్ నెలలో మొదటి వీకెండ్ లో వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. అది కేవలం స్కూల్స్ కు మాత్రమే కాదు.. కాలేజీలకు ఆఫీసులకు సెలవు ప్రకటించింది రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు. ఇంతకీ ఈ సెలవులు ఎందుకనే విషయానికొస్తే..
1/53 days School Holidays in This week: సెప్టెంబర్ లో నాలుగు సండేలతో పాటు రెండు శనివారాలతో పాటు దసరా సెలవులు కలిసితే దాదాపు విద్యార్ధులకు 15 రోజులకు పైగా సెలవులు ఉండనున్నాయి. కానీ ఈ వీకెండ్ లో అపుడే వరుసగా మూడు రోజులు సెలవులు రాబోతున్నాయి.
2/5ఈ నెల 5న శుక్రవారం ముస్లిమ్స్ పండగ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా స్కూల్స్ కు కాలేజీలతో పాటు ప్రభుత్వ ఆఫీసులకు సెలవు ప్రకటించింది. ఈ రోజు ఎలాంటి ప్రభుత్వ ఆఫీసులు, బ్యాంకులు పనిచేయవు. దీంతో బ్యాంక్ పనులతో పాటు ఇతరత్రా ప్రభుత్వ కార్యాలయాల్లో పనులుంటే ముందుగా చేసుకోవడం కానీ.. ఆ తర్వాత చేసుకోవడం బెటర్.
3/5సెప్టెంబర్ 6న వినాయక నిమజ్జనం సందర్భంగా అన్ని స్కూళ్లు, కళాశాలలు, ఇతర ప్రభుత్వ ఆఫీసులు ఆ రోజు పనిచేయవు. వాటికి సెలవులను ప్రకటించింది తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. ఎమర్జన్సీ డ్యూటీ వాళ్లకు మాత్రం మినహాయింపు ఉంటుంది. వినాయక నిమజ్జనం జరిగే హైదరాబాద్ లో ఈ వేడుక అత్యంత వైభవంగా జరగడం విశేషం.
4/5సెప్టెంబర్ 7 ఆదివారం సాధారణ సెలవు. దీంతో వరుసగా 5, 6,7 విద్యార్ధులకు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు రానుంది. దీంతో ఏదైనా ప్లాన్ చేసుకునే వారు ఇప్పటికే తమ ప్రణాళికను రూపొందించుకుంటే ఉత్తమం. ఏదైనా విహార యాత్రలకు గానీ.. ఇతరత్రా ప్రదేశాలు చూడాలనుకునే వారికి ఈ మూడు రోజులు కలిసొస్తాయి.
5/5అటు బతుకమ్మ, దసరా సెలవులు సెప్టెంబర్ 21నుంచి సెప్టెంబర్ 30 వరకు ఉండనున్నాయి.ఇప్పటికే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు తమ అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే కదా. మొత్తంగా సెప్టెంబర్ 21న బతుకమ్మ పండగ నుంచి స్కూళ్లకు కాలేజీలకు సెలవులు, కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఉండనున్నాయి