Vikramaditya Singh Got Second Marriage After Divorce sudarshana chundawat: గొప్ప రాజవంశం.. రాజకీయ కుటుంబం నుంచి వ్యక్తి మొదటి భార్యను వదిలేసి నెలలు కూడా కాకముందే రెండో పెళ్లి చేసుకున్నాడు. 36 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకోవడం హిమాచల్ ప్రదేశ్‌లో ఆసక్తికరంగా మారింది. ఆ రాజకీయ నాయకుడు ఎవరు? ఎవరినీ చేసుకున్నారో తెలుసుకుందాం.
1/6హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన రాజా వీరభద్ర సింగ్ ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన తనయుడు విక్రమాదిత్య సింగ్. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ మంత్రిగా పని చేస్తున్న విక్రమాదిత్య కాంగ్రెస్ పార్టీలో యువ నాయకుడిగా కొనసాగుతున్నారు. ఈయన గతంలో వివాహం చేసుకోగా గతేడాది విడాకులు ఇచ్చాడు. తాజాగా రెండో పెళ్లి చేసుకున్నాడు.
2/6పంజాబ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న అమ్రీన్ సెకోన్‌ను వివాహం చేసుకున్నారు. అంతకుముందు 2019లో సుదర్శన చుండావత్‌ను మొదటి వివాహం చేసుకున్న విక్రమాదిత్య ఆమెతో విభేదాల కారణంగా 2024 నవంబర్‌లో విడాకులు ఇచ్చారు.
3/6'ఈరోజు డాక్టర్ అమ్రీన్ కౌర్‌తో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నా. జీవితంలో ఒక ముఖ్యమైన కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నా. ఈ శుభ సమయంలో నా తండ్రి రాజా వీరభద్ర సింగ్ జీ లేకపోవడం బాధాకరం. కానీ ఆయన ఎల్లప్పుడూ నా మనసులో ఉంటారు. ప్రతి క్షణం ఆయన ఆశీస్సులు నాతో ఉంటాయి' అని ఇన్‌స్టాగ్రామ్‌లో విక్రమాదిత్య సింగ్ పోస్టు చేశారు.
4/6'నాకు హిమాచల్‌లోని 75 లక్షల మంది కంటే వేరే కుటుంబం లేదు. మీ ప్రేమ, గౌరవం, మద్దతు జీవితంలోని ప్రతి అడుగులోనూ ఉంది. ఈ రోజు నేను నా జీవిత భాగస్వామితో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు హిమాచల్ ప్రజలందరూ వారి ఆనందం, శుభాకాంక్షలు, ఆశీర్వాదం అందించాలని కోరుకుంటున్నా' అని విక్రమాదిత్య సింగ్ విజ్ఞప్తి చేశారు.
5/6'నా తండ్రి రాజా సాహెబ్ ఆశీర్వాదాలు, ఆయన చూపిన మార్గం నన్ను నడిపిస్తాయి. ఆయన వారసత్వాన్ని కొనసాగించాలనేది నా సంకల్పం. నా ఈ ప్రయాణంలో హిమాచల్‌లోని ప్రతి పౌరుడు వారి కుటుంబసభ్యుడిగా నాకు ప్రేమ, ఆశీర్వాదం ఇవ్వాలి' అని విక్రమాదిత్య సింగ్ పోస్టు చేశారు.
6/6చంఢీగడ్ లో బంధుమిత్రుల సమక్షంలో విక్రమాదిత్య సింగ్ వివాహం జరిగింది. రెండో వివాహానికి కొద్ది మంది సన్నిహితులు హాజరయ్యారు. ఈ పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలను విక్రమాదిత్య పంచుకున్నాడు.