Tecno Pova Slim 5G Price: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో tecno pova slim 5g మొబైల్ విక్రయాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనిని కంపెనీ అత్యంత తక్కువ ధరలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిపై స్పెషల్ ఆఫర్స్ ను కూడా అందుబాటులో ఉంచుతుంది.
Tecno Pova Slim 5G Price: ఎప్పటినుంచో అద్భుతమైన డిజైన్‌తో కూడిన మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకునేవారు ఇంకొన్ని రోజులపాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లోకి అద్భుతమైన ఫీచర్స్‌తో, పిచ్చెక్కించే డిజైన్‌తో శక్తివంతమైన tecno pova slim 5g మొబైల్ విడుదలైంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. అయితే, ఈ మొబైల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ఫీచర్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1/6ఈ మొబైల్‌ను కంపెనీ సెప్టెంబర్ 4 తేదీన భారతదేశంలో అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన మొదటి సేల్ సెప్టెంబర్ 8వ తేదీన అమెజాన్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కాబోతోంది. ఇది మొత్తం మూడు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
2/6ఈ tecno pova slim 5g మొబైల్‌ను కంపెనీ ఎన్నో శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది 6.78-అంగుళాల 3D కర్వ్‌డ్ AMOLED డిస్‌ప్లేతో పాటు 1.5K రిజల్యూషన్‌తో విడుదల అయింది.. దీని డిస్ప్లే గరిష్టంగా 4500 nits పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలిపింది.
3/6అలాగే ఈ మొబైల్ డిస్ప్లే ప్రొటెక్షన్ కోసం కంపెనీ దీనికి అదనంగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్ ప్రపంచంలోనే అత్యంత సన్నని 3D కర్వ్‌డ్ 5G ఫోన్‌లలో ఒకటిగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. ఇది మిలిటరీ గ్రేడ్ MIL-STD 810H సర్టిఫికేషన్ పొందినట్లు కూడా సమాచారం..
4/6ఈ tecno pova slim 5g మొబైల్ ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ఆక్టా-కోర్ చిప్‌సెట్ ప్రాసెసర్‌తో విడుదలైంది. దీని వెనకాల భాగంలో 50MP ప్రైమరీ సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా శక్తివంతమైన 5,160mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో విడుదలైంది.
5/6
6/6ఇక ఈ tecno pova slim 5g మొబైల్ ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ 15 ఆధారిత HiOS 15 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. అలాగే ఇందులో డైనమిక్ మూడ్ లైట్ డిజైన్, Ella AI అసిస్టెంట్ ఫీచర్ కూడా లభిస్తుంది. మార్కెట్లో కేవలం ఇది ఒక వేరియంట్‌లో మాత్రమే విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. దీని ధర రూ.19,999 నుంచి ప్రారంభం కాబోతోంది.