Prabhas Likely To Getting Marriage Very Soon Here Is Proof: పాన్ వరల్డ్ హీరో ప్రభాస్ వివాహంపై పుకార్లు జోరుగా వస్తుండగా.. తాజాగా పెళ్లి వైపు అడుగులు పడుతున్నాయని కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రభాస్ పెద్దమ్మ ఓ ప్రముఖ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారని చర్చ జరుగుతోంది. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.
1/6తెలుగు సినీ ఆరడుగుల ఆజానుబాహుడు ప్రభాస్ పెళ్లిపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. 45 ఏళ్ల వయసు పైబడిన ప్రభాస్ వివాహం త్వరలోనే జరగనుందని తెలుస్తోంది. అతడి పెళ్లిపై చర్చ జరుగుతున్న సమయంలోనే ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ఓ ప్రముఖ ఆలయంలో పూజలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
2/6హీరో ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి సోమవారం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ ఆలయాన్ని సందర్శించారు. కాకినాడ జిల్లాలో తలుపులమ్మ లోవ ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా జాతర జరుగుతోంది. ఈ జాతర సందర్భంగా ఆలయానికి ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి విచ్చేశారు.
3/6జాతర సందర్భంగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తలుపులమ్మ అమ్మవారికి ఆమె కుంకుమార్చన చేశారు. ప్రభాస్ పెద్దమ్మ రావడంతో ఆలయ అధికారులు, అక్కడి ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా ఆమెకు దర్శనం కల్పించారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ విశ్వనాథరాజు ఆలయ విశిష్టిత.. అమ్మవారి మహిమ వివరించారు.
4/6శ్యామల దేవి విచ్చేశారనే విషయం తెలుసుకుని ప్రభాస్ అభిమానులు ఆమెను చూసేందుకు తరలివచ్చారు. భక్తులతోపాటు ప్రభాస్ అభిమానులు ఆమెతో పలకరించేందుకు ప్రయత్నం చేశారు. ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు ఎగబడ్డారు.
5/6అనూహ్యంగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి ఆలయంలో ప్రత్యక్షం కావడం కొంత చర్చనీయాంశంగా మారింది. ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారని చర్చ జరుగుతున్న సమయంలో ఆమె ఆలయంలో పూజలు చేయడం ఆసక్తికరంగా మారింది.
6/6తన కుమారుడు ప్రభాస్ వివాహం కోసం శ్యామలా దేవి ఆలయంలో పూజలు చేశారని కొందరు చెబుతున్నారు. వయసు పైబడుతుండడంతో చక్కటి అమ్మాయి ప్రభాస్‌కు భార్యగా రావాలని పెద్దమ్మ శ్యామల దేవి ప్రార్థించి ఉంటారని ప్రభాస్ అభిమనులు భావిస్తున్నారు.