Add Zee Business As A Preferred Source
App

Recipes: కేవలం 10 నిమిషాల్లో పర్ఫెక్ట్‌గా సేమియాతో చేసే 5 సూపర్ టేస్టీ వంటకాలు

Written ByAruna Maharaju
Published: Sep 04, 2025, 07:14 PM IST|Updated: Sep 04, 2025, 07:14 PM IST

Vermicelli recipes: సేమియాతో రకరకాల వంటకాలు త్వరగా, రుచిగా తయారు చేయవచ్చు. దీనితో తీపి, కారం రెండు రకాల వంటకాలు చేసుకోవచ్చు. సేమియాతో ఉప్మా, పులావ్, ఖీర్, పాయసం వంటివి సులభంగా తయారవుతాయి. పండగలు లేదా ప్రత్యేక సందర్భాల్లో సేమియా వంటకాలు ఎక్కువగా చేస్తారు. 

Semiya Upma1/5

సేమియా ఉప్మా

సేమియా ఉప్మా: సేమియా ఉప్మా.. మరో సింపుల్ బ్రేక్‌ఫాస్ట్. దీన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంకా మీకు ఇష్టమైన కూరగాయలు వేసుకొని త్వరగా తయారు చేసుకోవచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి చాలా తేలికగా ఉంటుంది.

semiya kheer2/5

సేమియా ఖీర్

సేమియా ఖీర్: ఈ సేమియా ఖీర్ అంటే ఇష్టపడని వారు ఎవరూ కూడా ఉండరు. నెయ్యిలో వేయించిన సేమియాను మరిగించిన పాలలో వేసి చక్కెరతో కలిపి ఉడికిస్తారు. ఇంకా మరింత రుచి కోసం యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేస్తే సూపర్‌గా ఉంటుంది.   

semiya kichidi3/5

సేమియా కిచిడి

సేమియా కిచిడి: ఈ కిచిడి చాలా రుచిగా ఉంటుంది. పెసరపప్పు, మసాలాలు, సేమియాతో చేసే ఈ కిచిడిని అందరూ ఎంతో ఇష్టపడతారు. రుచికరమైన ఆహారం కావాలనుకునేవారికి ఇది గొప్ప ఎంపిక.  

semiya vegetable pulao4/5

సేమియా వెజిటేబుల్ పులావ్

సేమియా వెజిటేబుల్ పులావ్: ఈ పులావ్ చేయడానికి ఎక్కువ సమయం అవసరం లేదు. కూరగాయలు, మసాలాలు కలిపి చేసే పులావ్ కూడా త్వరగా తయారవుతుంది. ఇది రుచితో పాటు సులభంగా చేయడానికి అనువైనది. 

semiya lemon receipe5/5

నిమ్మకాయ సేమియా

నిమ్మకాయ సేమియా: నిమ్మకాయ సేమియా కూడా రుచికరమైన వంటకం. సేమ్ సేమియా ఉప్మాలాగే చేసి.. చివర్లో నిమ్మరసం కలిపితే రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది. దీన్ని వేడిగా తింటే మరింత రుచిగా ఉంటుంది. సేమియాతో చేసే ఈ వంటకాలు సులభమైనవి, రుచికరమైనవి, అందరికీ ఇష్టమైనవి.