Sugar Control: మన శరీరంలో రక్త చక్కెర స్థాయిలు.. నియంత్రణలో ఉండటం చాలా ముఖ్యం. డయాబెటిస్ ఉన్నవారికి మాత్రమే కాదు.. ఆరోగ్యంగా ఉండాలనుకునేవారికి కూడా ఇది అవసరం. కొన్ని నాచురల్ డ్రింక్స్.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అవేంటో చూద్దాం.
1/5తగినంత నీరు తాగకపోతే శరీరంలో హార్మోన్ల మార్పులు జరిగి రక్త చక్కెర స్థాయిలు పెరగవచ్చు. రోజూ సరిపడా నీరు తాగడం వల్ల చక్కెర స్థాయిలు.. సమతుల్యంగా ఉంటాయి. అలాగే ఆకలి తగ్గి..అధికంగా తినే అలవాటు కూడా తగ్గుతుంది.
2/5పాలలో కొవ్వు మరియు ప్రోటీన్ ఉండటం వలన ఆహారం జీర్ణం అవడంలో సమయం పడుతుంది. దీని వలన రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగదు. ముఖ్యంగా తక్కువ ..కొవ్వు ఉన్న పాలు.. తాగడం చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.
3/5గ్రీన్ టీ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు.. కాటెకిన్స్ రక్త చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని.. మెరుగుపరుస్తుంది. రోజూ ఒక కప్పు మధురం లేని గ్రీన్ టీ తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.
4/5బ్లాక్ టీ లో ఉన్న థీఫ్లేవిన్స్ అనే పదార్థాలు శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తాయి. ఇది రక్త చక్కెర స్థాయిలను.. నియంత్రించడంలో.. మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
5/5టమోటా జ్యూస్ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా.. ఉంటుంది. ఇది రక్త చక్కెర ఒక్కసారిగా పెరగకుండా నిరోధిస్తుంది. భోజనం ముందు ఒక కప్పు టమోటా.. జ్యూస్ తాగితే రక్త చక్కెర నియంత్రణలో ఉంటుంది.