Hibiscus Hair Mask: వేగంగా తాటి చెట్టులాగా జుట్టు పెరగడానికి 5 అద్భుతమైన మందార పువ్వు మాస్క్ ఐడియాలు..!

Hibiscus Hair Packs: మందార పువ్వులు సహజంగా జుట్టును బలంగా, మెరిసేలా.. ఆరోగ్యంగా ఉంచే అద్భుతమైన చిట్కాగా పనిచేస్తుంది. మరి మీ ఇంట్లోనే తయారు చేసుకొని 5 సులభమైన మందార పువ్వులు హెయిర్ మాస్క్‌లు ఏమిటంటే..

1 /6

మందార పువ్వులు.. కేవలం అందంగా ఉండటానికి మాత్రమే కాదు.. జుట్టుకు కూడా అమోఘమైన ప్రయోజనాలు కలిగిస్తాయి. వీటిలో జుట్టు పెరుగుదలకై అవసరమైన ప్రోటీన్‌లు.. విటమిన్‌లు సమృద్ధిగా ఉంటాయి. ఇప్పుడు మందార పువ్వులు.. ఉపయోగించి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచే ఐదు సులభమైన మార్గాలను తెలుసుకుందాం.

2 /6

పొడి మందార పువ్వులలో ఉన్న అమినో ఆమ్లాలు జుట్టుకు కావలసిన కేరటిన్ ప్రోటీన్‌ను తయారు చేయడంలో సహాయపడతాయి. కొద్దిగా పొడి దాసపుష్పాలు.. ఒక కప్పు కొబ్బరి నూనె కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని వారానికి మూడు సార్లు తలకు రాసుకుంటే జుట్టు బలంగా..మెరిసేలా పెరుగుతుంది.

3 /6

కెమికల్ షాంపూల వలన జుట్టు సహజ నూనెలు తగ్గిపోతాయి. దానిని నివారించేందుకు దాసపుష్ప పొడి, శెనగపిండి, నీరు కలిపి పేస్ట్ చేసుకోవాలి. వారానికి ఒకసారి దీన్ని షాంపూ మాదిరిగా వాడితే జుట్టు మృదువుగా..శుభ్రంగా ఉంటుంది.

4 /6

పొడి దాసపుష్పాలు మ్యూసిలేజ్ అనే పదార్థాన్ని కలిగి ఉంటాయి..ఇది జుట్టును తడిగా.. మృదువుగా ఉంచుతుంది. కొంత పూలు నీటిలో నానబెట్టి పేస్ట్‌గా చేసి 20 నిమిషాలు తలకు రాసి ఉంచాలి. తరువాత నీటితో కడగాలి. ఇది జుట్టు తేమను కాపాడుతుంది.

5 /6

దాసపుష్పాలు తల చర్మంలోని నూనె సమతుల్యతను కాపాడతాయి. దాసపుష్ప పొడిలో ఆలోవెరా జెల్, మెహెంది ఆకులు.. కొద్దిగా నిమ్మరసం కలిపి వారంలో రెండు సార్లు వాడితే చుండ్రు తగ్గుతుంది.

6 /6

విటమిన్ C.. అమినో ఆమ్లాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. మూడు పొడి దాసపుష్పాలు, స్వీట్ ఆల్మండ్ ఆయిల్ కలిపి ఒక వారంరోజులు ఉంచాలి. ఆ నూనెతో రోజుకు రెండుసార్లు తలకు మసాజ్ చేస్తే జుట్టు రాలిపోవడం తగ్గుతుంది.