Fatty Liver Vegetables: ప్రస్తుతం తరం వారిని ఫ్యాటీ లివర్ సమస్య ఎంతగానో వేధిస్తోంది. ఇది ఏకంగా సైలెంట్ కిల్లర్గా మారుతుంది. మరి అలాంటి ఫ్యాటీ లివర్ నివారించాలి అన్న.. వచ్చిన వాళ్ళు దాని నుంచి బయటపడాలి అన్న ఆహార అలవాట్లల్లో కొన్ని మార్పులు చేసుకోవడం ఎంతో అవసరం. మరి పార్టీ లివర్ ని.. మటుమాయం చేయగలిగే ఐదు కూరగాయలు ఏమిటి అనేది ఒకసారి చూద్దాం..
1/5ఫ్యాటీ లివర్ బాధతో సమస్య పడుతున్న వారు.. తప్పకుండా తినవలసిన పదార్థం.. బ్రోకలి..ఇందులో ఉండే గ్లూకోసినోలేట్లు .. కాలేయాన్ని శుభ్రం చేయడంలో అలా కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.
2/5పాలకూర కూడా ఫ్యాటీ లివర్ని నివారించడంలో ఎంతగానో సహాయపడుతుంది. వారంలో కనీసం రెండు రోజులు పాలకూర తినడం వల్ల.. కాలేయానికి సంబంధించిన ఎన్నో రోగాలు దూరంగా ఉంటాయి.
3/5బ్రస్సెల్స్ మొలకలు లివర్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ఉండే ఇండోల్ కాలేయంలో కొవ్వు నిల్వ ఉండకుండా కాలేయం నుంచి నిరోధిస్తుంది. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల లివర్ సమస్యలు తగ్గుతాయి..
4/5ఫ్యాటీ లివర్..నివారించడంలో క్యాబేజీ కూడా ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇందులో మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెన్స్ సమృద్ధిగా లభిస్తాయి. దీనిని కనీసం రెండు రోజులకు ఒకసారి తినడం వల్ల కాలేయానికి సంబంధించిన రోగాల నుంచి బయట పడవచ్చు.
5/5రోజుకి కనీసం ఒక క్యారెట్ తినడం వల్ల…కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గుతూ వస్తుంది. ఇక జీర్ణక్రియ మెరుగుపరతమే కాకుండా బరువు కూడా తగ్గవచ్చు.