Add Zee Business As A Preferred Source
App

500 Rupees Note: రూ.500 నోట్లపై కేంద్రం నిషేధం? పీఐబీ కుండబద్ధలు కొట్టే నిజం చెప్పింది!

Written ByHarish Darla
Published: Sep 24, 2025, 12:30 PM IST|Updated: Sep 24, 2025, 12:30 PM IST

500 Rupees Note Ban 2025: కేంద్ర ప్రభుత్వం రూ. 2,000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నోట్లు కూడా 100 శాతం బ్యాంకులకు తిరిగి రాలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో రూ.500 నోట్లు కూడా త్వరలోనే రద్దు అవుతాయని ప్రచారం జరుగుతోంది. 

fake 500 rupees note update1/8

ఈ 2,000 రూపాయల నోట్లను చలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ మే 19, 2023న ప్రకటించింది. అయినప్పటికీ.. కోట్లాది రూపాయలు ఇప్పటికీ ప్రజల వద్ద మిగిలి ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి.    

500 rupees note ban news2/8

దేశంలో ప్రభుత్వం త్వరలో రూ.500 నోట్లను రద్దు చేయనుందనే వార్త వైరల్ అవుతోంది. ఈ వార్త చూసిన తర్వాత ప్రజలు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు.    

fake 500 rupees note3/8

2026 మార్చి నాటికి రూ.500 నోట్లను చలామణి నుండి ఉపసంహరించుకోవాలనే ఆర్‌బీఐ ప్రణాళిక అని అనేక వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.  

Finance ministry on 500 rupees note4/8

దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మార్చి 2026 నాటికి చాలా సందర్భాలలో రూ.500 నోట్లు చెలామణిలో ఉండవు అనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.   

500 Rupees Note Ban 20255/8

12 నిమిషాల ఈ యూట్యూబ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభుత్వ యాజమాన్యంలోని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఇటీవల ఈ ప్రచారానికి ప్రతిస్పందించింది.    

500 rupees note update6/8

ప్రభుత్వం రూ.500 నోట్లను ఉపసంహరించుకోవడం లేదు. అవి చెలామణిలోనే ఉంటాయి. వైరల్ అవుతున్న వీడియోలు అబద్ధమని స్పష్టం చేసింది.    

500 Rupees Note Ban7/8

ఈ నోట్లు దేశవ్యాప్తంగా చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పష్టం చేసింది. వీటి జారీ, అంగీకారం యథావిధిగా కొనసాగుతుంది.    

500 rupees note8/8