3 Rajyogas 3 Lucky Signs: జాతక చక్రంలో రాజయోగాలు ఏర్పడినప్పుడు లక్కీ సమయం కలిసి వస్తుంది. తద్వారా విజయాలు వరిస్తాయి. 500 ఏళ్ల తర్వాత మరో అద్భుత యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ మూడు రాజయోగాల వల్ల దీపావళి తర్వాత మూడు రాశులకు బంపర్ ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతి పనిలో విజయం సాధిస్తారు.
1/5దీపావళి తర్వాత మూడు రాశులకు భారీ ప్రయోజనాలు కలిసి వస్తాయి. వీరు నక్క తోక తొక్కినట్లే ప్రధానంగా శుక్రుడు బృహస్పతి వల్ల వీరికి ఈ భారీ లాభాలు కలుగుతాయి. శుక్రుడు అంటే విలాసం, ఆనందానికి ప్రతీక. ఇక బృహస్పతి జ్ఞానం, కీర్తి, శ్రేయస్సుకు కారకుడు. ఈ రెండు గ్రహాలు కలిసి అద్భుత యోగాన్ని ఏర్పాటు చేస్తున్నాయి.
2/5జ్యోతిష్యం ప్రకారం ఈ రెండు రాశులు కలవడం వల్ల హంస, మాలవ్య, బుధాదిత్య అంటే మూడు రాజయోగాలు ఏర్పడుతున్నాయి. దీంతో ఈ మూడు రాశుల వారికి బంపర్ లాభాలు కలుగుతాయి. పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తయిపోతాయి. అదృష్ట కాలం అంటే ఇదే.
3/5కర్కాటక రాశి.. ఈ మూడు రాజయోగల వల్ల కర్కాటక రాశి వారికి భారీ ప్రయోజనాలు కలుగుతాయి. కోరుకున్న ప్రతిదీ జరుగుతుంది. ఈ మూడు యోగాల వల్ల కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. పెండింగ్లో ఉన్న పనులు సైతం పూర్తవుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.
4/5కుంభరాశి.. మూడు రాజయోగాల వల్ల దీపావళి తర్వాత విజయాఢంకా మోగించే మరో రాశి కుంభరాశి అదృష్ట ద్వారాలు తెలుసుకోవడంతో పాటు ఐశ్వర్యం కలిసి వస్తుంది. కుంభరాశి వారికి ఆ విదేశాలకు వెళ్లే యోగం కూడా ఏర్పడుతుంది. కొత్త పనులు కూడా చేపడుతారు.
5/5మకర రాశి.. ఈ రాజయోగాల వల్ల మకర రాశి వారు కూడా లక్కీ సమయం అని చెప్పాలి. పని ప్రదేశంలో పదోన్నతి పొందే అవకాశం కూడా ఉంది. ఉద్యోగస్థులకు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపారాలు కూడా పుంజుకుంటాయి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)