Add Zee Business As A Preferred Source
App

Heroine Dating: ఒకేసారి 12 మందితో డేటింగ్ చేసిన స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో తెలుసా?

Published: Sep 07, 2025, 09:23 PM IST|Updated: Sep 07, 2025, 09:23 PM IST

55 Years Old Star Heroine Date With 12 Actors At A Time Know Who Is That Actress: సినీ పరిశ్రమలో పరిచయాలు కాస్త ప్రేమలుగా మారి డేటింగ్‌ వరకు వెళ్తుంటాయి. అలా ఓ హీరోయిన్‌ ఒకేసారి 12 మందితో డేటింగ్‌ చేశారనే వార్త సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది. ఆమె ఎవరో తెలుసుకుందాం.

1/6

సినీ పరిశ్రమలో ప్రేమ, డేటింగ్‌, వివాహం, విడాకులు అనేవి సర్వసాధారణంగా మారాయి. అలా సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించిన స్టార్‌ హీరోయిన్‌ కూడా అలాంటి వ్యవహారాలు నడిపించారు. అయితే ఆమె ఏకంగా ఒకేసారి 12 మందితో డేటింగ్‌లో ఉన్నారనే వార్త ఆసక్తికరం. ఆమెవరో తెలుసా? విజయవంతమైన సినిమాలు చేసిన మనీషా కొయిరాలా.

2/6

పాతికేళ్ల కిందట మనీషా కొయిరాలా స్టార్‌ హీరోయిన్‌గా రాణించారు. తన అందం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన మనీషా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం మనీషా వయసు 55 ఏళ్లు ఉంది. ఆమె గతంలో చేసిన డేటింగ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 

3/6

స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్న మనీషా కొయిరాలా పెళ్లికి ముందు 12 మంది పురుషులతో డేటింగ్ చేసిందనే వార్త బయటకు వచ్చింది. హీరోయిన్‌గా రాణిస్తున్న క్రమంలో వారితో డేట్‌ చేసినట్లు పుకార్లు వస్తున్నాయి. అయితే ఇవి వాస్తవమో కాదో తెలియదు కానీ చర్చనీయాంశంగా మారింది.

4/6

నాటి హీరోయిన్‌ మనీషా కొయిరాలా డేటింగ్‌ చేసిన వారిలో ప్రముఖ నటులు వివేక్ ముష్రాన్, నానా పటేకర్, డీజే హుస్సేన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ నటులతో డేటింగ్‌ వ్యవహారం సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోంది.

5/6

సినీ పరిశ్రమలో కొనసాగుతున్న మనీషా కొయిరాలా నేపాలీ వ్యాపారవేత్త సామ్రాట్ దహల్‌ను వివాహం చేసుకుంది. కానీ వారి వివాహ జీవితం కొన్నాళ్లకు ముగిసిపోయింది. భేదాభిప్రాయాలతో కొంతకాలం తర్వాత మనీషా తన భర్త నుంచి విడిపోవాల్సి వచ్చింది.

6/6

భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత మనీషా ఒంటరి జీవితం గడుపుతోందని సమాచారం. సినిమాలకు దూరమైన మనీషా వ్యక్తిగత కార్యక్రమాలతో బిజీగా మారిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్‌ మెల్లగా ప్రారంభించి ప్రత్యేకమైన పాత్రలను ఎంచుకుంది.