71st National Film Awards: 71వ జాతీయ చలన చిత్ర అవార్డులు ఈ రోజు (మంగళ వారం) రాష్ట్రపతి భవన్ లో అట్టహాసంగా జరిగింది. అవార్డు గ్రహీతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు ప్రధానం చేశారు. ఈ వేడుకలో సమాచార ప్రసార శాఖ, రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ పాల్గొన్నారు.
1/7మోహన్ లాల్ కు భారతీయ చలన చిత్ర రంగంలో అత్యున్నత అవార్డు దాదాసాహెబ్ ఫాల్కేను మోహన్ లాల్ కు రాష్ట్రపతి అందజేశారు. మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి ఈ అవార్డు అందుకున్న తొలి హీరోగా రికార్డులకు ఎక్కారు. అంతకు ముందు డైరెక్టర్ ఆదూరు గోపాలకృష్ణన్ అవార్డు అందుకున్న హీరోగా అవార్డు అందుకోవడం విశేషం.
2/7షారుఖ్ ఖాన్..
బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్ ఖాన్.. ‘జవాన్’ సినిమాలోని నటనకు గాను తొలిసారి ఉత్తమ నటుడిగా జాతీయ చలన చిత్ర అవార్డును రాష్ట్రపతి చేతులు మీదుగా అందుకోవడం విశేషం. ఈ అవార్డును విక్రాంత్ మస్సేతో పంచుకున్నారు.
3/7విక్రాంత్ మస్సే..
విక్రాంత్ మస్సే ..12Th ఫెయిల్ సినిమాలోని నటనకు గాను విక్రాంత్ మస్సే ఫస్ట్ టైమ్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ ద్రౌపది ముర్ము చేతులు మీదుగా అందుకున్నారు. ఈ అవార్డును షారుఖ్ తో పంచుకోవడం విశేషం.
4/7రాణి ముఖర్జీ..
మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే సినిమాలోని నటనకు గాను తొలిసారి రాణి ముఖర్జీ ఉత్తమ నటిగా జాతీయ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా అందుకున్నారు.
5/7విధు వినోద్ చోప్రా..
12Th ఫెయిల్ జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా దర్శక, నిర్మాతగా విధు వినోద్ చోప్రా రాష్ట్రపతి చేతులు మీదుగా అవార్డు అందుకున్నారు.
6/7హర్షవర్ధన్ రామేశ్వర్..
యానిమిల్ సినిమాలోని బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విభాగంలో హర్షవర్ధన్ రామేశ్వర్ జాతీయ అవార్డు అందుకున్నారు.
7/7GV ప్రకాష్.. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్..
సార్ (వాతి) సినిమాకు మంచి సంగీతం అందించిన జీవీ ప్రకాష్ కు జాతీయ చలన చిత్ర అవార్డు రాష్ట్రపతి చేతులు మీదుగా అందుకున్నారు.