71st National Film Awards: 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంగా ‘భగవంత్ కేసరి’ సినిమా అవార్డును దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహూ గారపాటి అందుకున్నారు. ఉత్తమ గేయ రచయతగా కాసర్ల శ్యామ్, సాయి రాజేష్ వంటి వాళ్లు అవార్డులు అందుకున్నారు.
1/6భగవంత్ కేసరి.. అనిల్ రావిపూడి
ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు కైవసం చేసుకున్న బాలకృష్ణ హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమా అవార్డు గెలిచింది. ఈ సినిమా దర్శకుడిగా అనిల్ రావిపూడితో పాటు నిర్మాత సాహు గారపాటి అవార్డు అందుకున్నారు.
2/6బేబి.. సాయి రాజేష్
ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో బేబి సినిమా దర్శకుడు సాయి రాజేష్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా అవార్డు అందుకున్నారు. సాయి రాజేష్ కు ఇది రెండో జాతీయ అవార్డు.
3/6పీవీఎస్ ఎన్ రోహిత్ - బేబి.. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘బేబి’ సినిమాలోని పాటకు గాను పీవీఎస్ ఎన్ రోహిత్ జాతీయ అవార్డు అందుకున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తర్వాత తెలుగు నుంచి ఈ అవార్డు అందుకున్న గాయకుడిగా రికార్డు క్రియేట్ చేశాడు.
4/6కాసర్ల శ్యామ్..
తెలుగు సినిమాల్లో తెలంగాణ పాటలతో ఫేమస్ అయిన రచయత కాసర్ల శ్యామ్.. ‘బలగం’ సినిమాలోని ఊరు పల్లెటూరు పాటకు గాను జాతీయ అవార్డు అందుకున్నారు. శ్రీశ్రీ, వేటూరి, సుద్దాల, చంద్రబోస్ తర్వాత ఈ అవార్డు అందుకున్న ఐదో వ్యక్తి కావడం విశేషం.
5/6ప్రశాంత్ వర్మ సహా - హనుమాన్ సినిమాకు అవార్డులు.. దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాకు గాను బెస్ట్ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్ విభాగంలో అవార్డు అందుకున్నారు. జెట్టి వెంకట కుమార్, బెస్ట్ యానిమేషన్ చిత్రం నిర్మాతగా నిరంజన్ రెడ్డి అవార్డు అందుకున్నారు. నందు, పృథ్వీ బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ గా అవార్డు హనుమాన్ సినిమా విభాగంలో అందుకున్నారు.
6/6సుకృతి వేణు - గాంధీ తాత చెట్టు.. గాంధీ తాత చెట్టులోని నటనకు గాను బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్ గా సుకృతి వేణు ద్రౌపది ముర్ము చేతులు మీదుగా అవార్డు అందుకుంది. జాతీయ చలన చిత్ర అవార్డుల్లో రాష్ట్రపతి ప్రత్యేకంగా ఈ సినిమా గురించి ప్రస్తావించడం విశేషం.