7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్. డీఏ కేవలం 2 శాతమే పెంచనుందని తెలుస్తోంది. ఈ వారంలో హోలీ పండుగ సందర్భంగా జనవరి డీఏ ప్రకటించనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ పెంపు ప్రకటన విడుదల కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
డీఏ ఎంత కేంద్ర కార్మిక శాఖ జారీ చేసే ఏఐసీపీఐ ఇండెక్స్ గణాంకాలను బట్టి ఈసారి డీఏ కేవలం 2 శాతం మాత్రమే పెరగవచ్చని తెలుస్తోంది.
ఈసారి ఏఐసీపీఐ ఇండెక్స్ ఏం చెబుతోంది డిసెంబర్ 2024 ఏఐసీపీఐ ఇండెక్స్ ప్రకారం 0.8 పాయింట్లు పెరిగి 143.7కు చేరుకుంది. నవంబర్‌లో ఇది 144 ఉంది. అంటే కొద్దిగా తగ్గింది.
ఏడాదికి రెండు సార్లు డీఏ డీఆర్ పెంపు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రెండు సార్లు డీఏ, డీఆర్ పెంచుతుంటుంది. ప్రతి ఏటా జనవరి-జూలై నెలల్లో పెంచాల్సిన డీఏ పెంపు ప్రకటన మార్చ్ -సెప్టెంబర్ నెలల్లో ఉంటుంది.
ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా డీఏ లెక్కింపు కేంద్ర కార్మిక శాఖ జారీ చేసే ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా డీఏ లెక్కింపు ఉంటుంది. ఈ సూచీ గణాంకాలను బట్టి డీఏ ఎంత పెంచాలో నిర్ణయిస్తుంటారు
గత ఏడాది అక్టోబర్ నెలలో డీఏ పెంపు గత ఏడాది అక్టోబర్ నెలలో చివరిసారి డీఏ పెరిగింది. కేంద్ర కేబినెట్ 3 శాతం డీఏ పెంచేందుకు ఆమోదం తెలిపింది. దాంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరుకుంది.
డీఏ-డీఆర్ ఎంత పెరగనుంది డీఏ విషయంలో ఈసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ-డీఆర్ కేవలం 2 శాతమే పెరగవచ్చని తెలుస్తోంది. అధికారికంగా ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చూస్తున్నారు.
హోలీ నజరానాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించే డీఏ-డీఆర్ కొద్దిమేర పెరగనుంది. హోలీ సందర్భంగా డీఏ పెంపు ప్రకటన రానుంది.