8th Pay Commission Update: కొత్త పే కమిషన్‌ అమలు తేదీపై బిగ్‌ అప్‌డేట్.. లోక్‌సభలో కేంద్ర మంత్రి రియాక్షన్ ఇదే..!

8th Pay Commission Implementation Date: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన భత్యాలకు సంబంధించి ప్రస్తుతం కొత్త పే కమిషన్ అధ్యయనం చేస్తోంది. అయితే సిఫార్సులు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయో క్లారిటీ లేకపోవడంతో ఉద్యోగులు కాస్త సందిగ్ధంలో ఉన్నారు. తాజాగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ విషయంపై స్పందించారు. పూర్తి వివరాలు ఇలా..
 

1 /7

8వ కేంద్ర వేతన సంఘం పరిధిలోకి వచ్చే ఉద్యోగుల స్కేల్‌పై ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా వివరాలను పార్లమెంట్‌లో వెల్లడించింది. అధికారిక సమాచారం ప్రకారం.. తదుపరి వేతన సవరణ కింద 50.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, దాదాపు 69 లక్షల మంది పెన్షనర్ల లబ్ధి పొందనున్నారు.    

2 /7

కొత్త పే కమిషన్ సిఫార్సులు ఎప్పుడు అమలులోకి వస్తాయి..? ఎంత మంది ఉద్యోగులు, పెన్షనర్లకు వర్తిస్తుంది..? అనే ప్రశ్నలకు సమాధానంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.  

3 /7

8వ వేతన సంఘం ఇప్పటికే ఏర్పాటు చేశామని.. అమలు తేదీని ప్రభుత్వం తరువాత నిర్ణయిస్తుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. దాని నిబంధనలు (ToR) నవంబర్ 3, 2025న ఆర్థిక మంత్రిత్వ శాఖ తీర్మానం ద్వారా తెలియజేసినట్లు తెలిపారు.  

4 /7

కొత్త పే కమిషన్ అమలుకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని ప్రతిపాదిస్తుందా..? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. 8వ CPC ఆమోదించిన సిఫార్సులను అమలు చేయడానికి ప్రభుత్వం తగిన బడ్జెట్ కేటాయిస్తుందని పేర్కొన్నారు.  

5 /7

కమిషన్ పురోగతి, అధ్యయన కాలం, ఆర్థిక చిక్కులపై అడిగిన ప్రశ్నలకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్‌మెంట్ అయినవారికి సవరించిన పే మ్యాట్రిక్స్, అలవెన్సులు, పెన్షన్ నిర్మాణాలు, ఇతర ప్రయోజనాలను పరిశీలించి కమిషన్ సిఫార్సు చేస్తుందన్నారు.   

6 /7

కమిషన్ ప్రస్తుతం అధ్యయనం చేస్తుండగా.. సిఫార్సులు సమర్పించేందుకు కేంద్రం 18 నెలల గడువు ఇచ్చింది. సిఫార్సులు పరిశీలించిన తరువాత అమలు తేదీని కేంద్రం ప్రకటించనుంది.   

7 /7

బేసిక్ పేతో డీఏ విలీనం చేయడంపై కేంద్ర మంత్రి స్పందించలేదు. అయితే ఆయన సమాధానంతో 8వ వేతన సంఘం కింద లబ్ధిదారుల సంఖ్యపై క్లారిటీ వచ్చింది. కోటి మందికి పైగా కొత్త పే కమిషన్ అప్‌డేట్స్‌ కోసం ఎదురుచూస్తున్నారు. జీత సవరణలు, పెన్షన్ సర్దుబాట్లపై అంచనాలు పెరిగిపోతున్నాయి.