8th Pay Commission News Updates: కొత్త పే కమిషన్ అప్‌డేట్స్ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వేతన స్కేళ్లు, అలవెన్సులు, ఉద్యోగులకు ఇతర ప్రయోజనాలకు సంబంధించి మార్పులను సమీక్షించి సిఫారసు చేయడానికి ప్రతి పదేళ్లకు వేతన కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. 7వ వేతన సంఘం గడువు ఈ ఏడాది డిసెంబర్‌తో ముగియనుండగా.. ఇప్పటికే కేంద్రం 8వ వేతన సంఘం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అయితే టీఓఆర్‌ను ఖరారు చేసి చైర్మన్, కమిషన్ సభ్యులను నియమించడంలో జాప్యం జరుగుతోంది.
1/7కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వేతన పెంపునకు సంబంధించిన 8వ వేతన సంఘం (సీపీసీ) ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. జాప్యం కారణంగా కొత్త వేతన కమిషన్‌లో ప్రస్తుతం ఉన్న చాలా అలవెన్సులు రద్దు అవుతాయా..? అనే ఆందోళన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో నెలకొంది.
2/77వ వేతన సంఘం ఏర్పాటుకు ముందు అసంబద్ధంగా ఉన్న కొన్ని అలవెన్సులను తొలగించాలని కమిషన్ సిఫారసు చేసింది. 7వ సీపీసీని 2016 జనవరిలో అమల్లోకి రాగా.. పెంచిన అలవెన్సులు ఇంటి అద్దె భత్యం, రవాణా భత్యం తదితరాలను 2017 జూలై నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే అలవెన్సుల జాప్యం కారణంగా ఉద్యోగులకు బకాయిలు చెల్లించలేదు.
3/7ఇప్పుడు 8వ వేతన సంఘంలో లేని కొన్ని అలవెన్సులను ప్రభుత్వం రద్దు చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సమీక్ష తరువాత కొన్ని అలవెన్సులు ఇకపై వర్తించవని తొలగింపు కోసం కమిషన్ సిఫార్సు చేసే అవకాశం ఉంది.
4/78వ సీపీసీ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్) ఇంకా ఖరారు కాలేదు. కమిషన్ సభ్యులు, ఛైర్ పర్సన్ నియామకంలో ఆలస్యం జరుగుతోంది. దీంతో కొత్త సీపీసీలో కొన్ని అలవెన్సులను తొలగిస్తారా.. లేదా అనే అయోమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు.
5/7పే కమిషన్ ఏర్పాటు చేసిన తరువాత పని ప్రారంభించాలంటే టీఓఆర్ కీలకం అవుతుంది. కమిషన్ సిఫారసులకు లోబడి వేతన నిర్మాణం, అలవెన్సులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర అంశాలను ఇదినిర్ణయిస్తుంది. టీఓఆర్ ఖరారు అయ్యే వరకు ఉద్యోగుల ప్రయోజనాలను నిర్ణయించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో 8వ సీపీసీ కింద ప్రయోజనాలు లభిస్తాయో లేదా అని ఉద్యోగుల్లో అనిశ్చితి నెలకొంది.
6/7కొత్త పే కమిషన్ ఏర్పాటు చేస్తే కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బేసిక్ పే, అలవెన్సులు, పెన్షన్లను సవరించనున్నారు. అయితే సకాలంలో కొత్త పేకమిషన్ అమలు చేయకపోతే ఉద్యోగులు తాము కోరుకునే కొన్ని ప్రయోజనాలను కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
7/7టీఓఆర్‌ను ఆగస్టు నెలాఖరులోగా కేంద్రం ఆమోదించే అవకాశం ఉందని ఐఏఎన్ఎస్ నివేదిక తెలపగా.. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పే స్కేల్ లెవల్ 1ను లెవల్ 2తో.. లెవల్ 3ను లెవల్ 4తో.. లెవల్ 5ను లెవల్ 6తో విలీనం చేయాలని ఐఏఎన్ఎస్ కోరుతోంది.