Add Zee Business As A Preferred Source
App

8th Pay Commission Updates: కేంద్ర ఉద్యోగుల జీతాలు ఎలా పెంచుతారు..? ఈ ఐదు విషయాలు తప్పక తెలుసుకోండి..!

Published: Oct 31, 2025, 04:50 PM IST|Updated: Oct 31, 2025, 04:50 PM IST

Central Government Employees Salary Hike: దాదాపు 10 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కొత్త పే కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగుల సంతోషంలో ఉన్నారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి రంజనా దేశాయ్ నేతృత్వంలోని కమిటీ.. 18 నెలల్లో అధ్యయనం చేసి కేంద్రానికి సిఫార్సులు సమర్పించనుంది. ఉద్యోగుల జీతాలు, రిటైర్‌మెంట్ అయిన ఉద్యోగులకు పెన్షన్‌కు సంబంధించి సవరణలు చేయనుంది.

Central Government Employees Salary Hike1/7

కొత్త పే కమిషన్‌ అప్ డేట్స్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపునకు సంబంధించి కమిషన్ వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. అయితే ముఖ్యంగా ఐదు అంశాల ఆధారంగా జీతాల పెంపు ఉంటుంది.

Central Government Employees2/7

కొత్త పే కమిషన్‌

ముందుగా దేశ ఆర్థిక పరిస్థితులను కమిటీ అధ్యయనం చేస్తుంది. ఉద్యోగులకు జీతాల పెంపు కేటాయించే బడ్జెట్‌పై ఆధారపడి ఉంటుంది. ఆర్థిక పరిస్థితులను అంచనా వేసి కేంద్రానికి సిఫార్సులు చేస్తుంది.  

Salary Hike3/7

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్

డెవలప్‌మెంట్ వ్యయం.. సంక్షేమ కార్యకలాపాలకు తగిన వనరులు అందుబాటులో ఉన్నాయో లేదా అని కమిషన్ నిర్ధారించుకుంటుంది.  

8th pay commission4/7

జీతాల పెంపు

చందా లేని పెన్షన్ పథకాల ఆర్థిక వ్యయాన్ని కమిషన్ పరిగణలోకి తీసుకుంటుంది. అన్ని అంశాలను అధ్యయనం చేసిన తరువాత కేంద్రానికి సిఫార్సులు సమర్పిస్తుంది.  

8th pay commission News5/7

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు

ఆ తరువాత ఈ సిఫార్సులను పరిశీలించిన తరువాత కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తుంది. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ సిఫార్సులను కొన్ని మార్పులతో ఆమోదం తెలుపుతాయి. కమిటీ సిఫార్సులు రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్థితిపై చూపే ప్రభావాన్ని చూపిస్తాయి.   

8th pay commission Latest Updates6/7

8వ వేతన సంఘం

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు అందుబాటులో ఉన్న జీతాలు, ఇతర ప్రయోజనాలు, పని పరిస్థితులను కూడా కమిషన్ అధ్యయనం చేస్తుంది.   

8th Pay Commission fitment factor7/7

పే కమిషన్‌ జీతాల పెంపు

ఈ అంశాలతోపాటు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ జీతాల పెంపులో కీలకం కానుంది. ప్రస్తుతం 7వ వేతన సంఘంలో 2.57 ఉండగా.. 8వ వేతన సంఘంలో ఎంత ఉంటుందోనని ఉద్యోగుల్లో ఆసక్తి నెలకొంది.