8th Pay Commission Cut Off To Pension Before 1st Jan 2026: కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల మెడ మీద కత్తి వేటు వేసింది. 8వ వేతన సవరణ సంఘం సిఫార్సులు కేవలం 1 జనవరి 2026 తరువాత ఉద్యోగ విరమణ చేసిన వారికి మాత్రమే వర్తిస్తాయి. ఆ తేదీ ముందు వారికి 8వ వేతన సవరణ సంఘం సిఫార్సులు వర్తించవని ప్రకటించడంతో పింఛన్‌దారులకు భారీ షాక్ తగిలింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
1/58వ వేతన సంఘం సిఫారసులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం కారణంగా లక్షలాది పింఛనర్లకు భారీగా కోత పడనున్నట్టు సమాచారం. ఈ వార్తతో కేంద్ర ప్రభుత్వ పింఛన్‌దారులకు భారీ షాక్ తగలనుంది.
2/51 జనవరి 2026కు ముందు ఉద్యోగ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చేదు లాంటి వార్త ఇది. 8 వేతన సవరణ సంఘం సిఫార్సులు వర్తిస్తాయని ఆశతో ఉన్న వారికి భారీ దెబ్బ తగలనుంది. 8వ వేతన సంఘం సిఫారసుల ప్రకారం ప్రస్తుతం పదవీ విరమణ పొందిన వారికి పెన్షన్ పెరిగే అవకాశం లేదని తెలుస్తోంది.
3/5పెన్షనర్లకు ఇక పెన్షన్ సవరణ అనేది ఉండదని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో స్పష్టమవుతోంది. ఉద్యోగ విరమణ చేసినప్పుడు నిర్ణయించిన పింఛన్ మాత్రమే జీవించి ఉన్నంత కాలం తీసుకోవాలి. ఇది ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న చట్టంలోని అంశం.
4/5పింఛన్ సవరణకు సంబంధించిన బిల్లును ఇటీవల లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించుకోగా.. రాజ్యసభ ఆమోదం పొందాల్సి ఉంది. అక్కడ కూడా బిల్లు ఆమోదం పొందితే చట్టం అవుతుంది. ఇక పింఛన్‌దారులకు నోటిలో మట్టి కొట్టినట్టు అవుతుంది.
5/5ఈ బిల్లుకు వ్యతిరేకంగా పింఛన్‌దారులు ఉద్యమం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే తమ నిరసనను పలు విధాల్లో తెలిపిన కేంద్ర ప్రభుత్వ పింఛన్‌దారులు ఇక ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే పింఛన్‌దారులు కార్యాచరణ ప్రకటించనున్నారు.